Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

305

కూడా జర్మన్‌ భాష స్వీకరించలేదు. నూతనావశ్యకాలేర్పడ్డప్పుడుకూడా జర్మన్‌ భాషా వ్యవహర్తలు సాధ్యమయినంతవరకు దేశీయ పదాలతోటే నామకల్పన చేసుకోవడం సులువయినదిగా భావించడం దీనికే హేతువుగా చెప్పుకోవచ్చు. (Sapir, 1921 : 195 & 196). ద్రావిడభాషలలో తెలుగు, కన్నడం, మళయాళంవంటి సాహిత్య వ్యావసాయిక భాషలవలెగాక, తమిళం సంస్కృత భాషా ప్రభావాన్ని పదేపదే నిరోధిస్తూ వచ్చినట్లు కన్పిస్తుంది. మరీ మించివస్తే తప్ప, వీలైనంతవరకు నూతనభాష వ్యక్తీకరణంపట్ల తమిళం దేశీయ పదాలతోటే సరిపుచ్చుకుంది. ఒకప్పుడు తత్సమభూయిష్టరచనని నిరోధించడానికి జాను తెనుగు, అచ్చ తెనుగు అనే పేర తలెత్తిన కావ్యరచనోద్యమాలు తెలుగువారికి కొత్తవి కావు. కన్నడంలోని అచ్చగన్నడ సంప్రదాయం సయితం ఈ కోవకు చెందిందే. ఆధునికయుగంలో దేశీయకరణం పేరిట హిందీభాషలోని అరబ్బీ, తుర్కీ, పారసీ మాతృకాలగు పదాలను పరివారించి వాటి స్థానంలో సంస్కృతాన్ని చొవ్పించడానికి సాగుతున్న ఉద్యమాన్ని దీనికి మరో నిదర్శనంగా పేర్కోవచ్చు.

   10.5. నూతన వస్తుదర్శన స్పర్శన సాహచర్యాదులవల్లనూ, నూతనాచార విచారాలవల్లనూ, ఆహారవిహారాలవల్లనూ నూతనవస్తుద్యోతకాలుగా నూతనభావస్ఫోరకాలుగా కొత్తపదాల ఆవశ్యకం తప్పనిసరిగా పెరిగి తీరుతుంది. ఈ సందర్భంలో మాతృక (model language) లో ఉన్న రూపాన్ని యథాతథంగా ఎరవు తెచ్చుకోవచ్చు; లేక ప్రతిగ్రహీత భాషా (recepient language) నిర్మాణాన్ని అనుసరించిన ధ్వని పరిణామాలతో స్వీకరించవచ్చు. మరి కొన్నింటిని బోధించడానికి దేశ్యపదాలతోటే నామకల్పన చేయవచ్చు. అమెరిక నిండియన్‌ భాషలలో దేశీయపదభూయిష్టమైన వర్ణనాత్మక రీతి దీనికొక నిదర్శనంగా నిరూపించవచ్చు (Bloomed, 1933 : 455). అనేక సందర్భాలలో నూతనభావవ్యక్తి కరణంపట్ల జర్మనులుకూడా దేశ్య పదాలనే విరివిగా వాడుకున్నట్లు మనం ఇంతకు ముందే గమనించాం. తమిళభాషా వ్యవస్థనుకూడా దీనికి తార్కాణంగా పేర్కోవచ్చు. కొన్నింటిని వ్యక్తంచెయ్యడానికి దేశ్య పదాలున్నప్పటికీ, దేశ్యపదాలతో నామకల్పన చెయ్యడానికి వీలున్నప్పటికీ కొత్తపదం మీది మోజువల్లనో, ఝటితిస్పూర్తిని ఆశించడంవల్లనో, ప్రకరణోచితశయ్యావైయాత్యాన్ని పాటించాలనే నిశ్చయ జ్ఞానం కల్గడంవల్లనో ప్రదాతృభాషనించి సరికొత్త పదాలను ఎరవు తీసుకురాక తప్పదు. సమాజవ్యవస్థలో ఆయా వస్తువుల

(20)