286 తెలుగు భాషా చరిత్ర
ముంచేత్తితే తప్ప ఈ స్వార్ధసంకుచిత ప్రతీప శక్తులను మొదలంటా పెకలించటం సాధ్యపడకపోవచ్చు. ఆ సమయం ఎంతో దూరానలేదు (చూ. 9.21, జ్ఞాపిక 9a).
9.20. ఇక గ్రాంథిక వ్యావహారిక వివాదాలను సంక్షిప్తంగా విమర్శించి 'ఆధునిక ప్రామాణికభాషాస్వరూపాన్ని స్థూలంగా నిర్దేశించవలసివుంది. భ్రమ ప్రమాదాత్మకమైన కొన్ని భావాలే ఈ వివాదానికి ప్రథమకారణ మనవచ్చు. కొన్ని సాంకేతికపదాలనూ, వాటి అర్థాలనూ సరిగా అర్థం చేసుకోనందున వచ్చిన భ్రమప్రమ లవి. మచ్చుకు 'వ్యాకరణం, గ్రామ్యం, అన్యదేశ్యాలు, ప్రామాణికత, భాషా స్థిరత్వం, ధ్వనిశాస్త్రం మొదలైనవి సాధ్యాసాధ్యాలను గుర్తించక పోవటం, ప్రాచీనతమీద అపారగౌరవం, నవీనతమీద అగౌరవానుమానాలు, భాషాస్వభావ జ్ఞానం లోపించటం, ప్రపంచపరిస్థితులను గమనించక పోవటం ఇందుకు ఉద్దీవకాలు. ఈ విషయాలను క్లుప్తంగా పరిశీలించినా గ్రా౦థికవాదంలోని అసహజత్వాన్నీ అనుపాదేయతనూ గుర్తించవచ్చు.
9.21. మొదట 'వ్యాకరణ' శబ్దం పరిశీలిద్దాం. భాషలో అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూత్రీకరించి రాసిన గ్రంథాన్ని 'వ్యాకరణగ్రంథ' మంటారు. ఆ లక్షణాలే ఆభాషకు వ్యాకరణంగాని, రాసిన పుస్తక మొక్కటే వ్యాకరణంకాదు. అందువల్ల కేవలం వాగ్య్వవహారంలో ఉన్న భాషకుకూడా వ్యాకరణం ఉంటుంది. దేశకాలపాత్రాలనుబట్టి వ్యవహారంలో వచ్చిన మార్పులు ఒక్కొక్క భాషలోని వ్యాకరణంలో కూడా మార్పులు తెస్తాయి. వాటిని గుర్తించి వ్యాకరణ 'సూత్రా'లను మార్చుకోవాలేగాని నిరాధారంగా సూత్రాలను మార్చినంత మాత్రాన వ్యాకరణం మారదు - సూత్రాలను మార్చనందువల్ల భాషలో వచ్చిన మార్పులు ఆగిపోవు. గ్రాంథికవాదులు ఈ చిన్న రహస్యాన్ని గుర్తించక వ్యావహారికానికి 'వ్యాకరణం' లేదు కాబట్టి ఉపాదేయం కాదన్నారు. మచ్చుకు కొమ్మరాజు లక్ష్మణరావుగారు వ్యాకరణమంటే సంప్రదాయ వ్యాకరణగ్రంథమని, లేదా అది అంగీకరించిన భాషా రూపాలని, వాటికి విరుద్దమైనరూపాలు అనంగీకార్యాలని వ్యావహారికానికి ప్రత్యేక వ్యాకరణంలేనందున అది 'గ్రామ్య'మని వాదించగా గురజాడవారు అధిక్షేపించారు.4 వ్యాకరణంవల్ల భాష స్థిరపడుతుందనీ స్థిరీకరించడంకోసమైనా ముందు వ్యాకరణం రాసి ఆ తర్వాత వ్యావహారికాన్ని ఉపయోగించమనీ గ్రా౦థికవాదులంటే, మొదటి భావం దుర్భ్రమ అని, రెండోపని అర్థరహితమని, వ్యావహారికవాదు లాక్షేపించి ప్రామాణికపాశ్చాత్యవిద్వాంసుల వాక్యాలను ఉద్ధరించి చూపేరు.5 భాషను