పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు 285

టానికి, పరిపాలన వ్యవహారాలకు కావలసిన సాంకేతిక సహాయం అందివ్వటానికి ఒక స్వత౦త్రసంస్ధను నెలకొల్పవలసిందని సూచించారు. వారే భద్రిరాజు కృష్ణ మూర్తిగారి సూచనల మేరకు ఆసంస్థ ప్రచురణ లన్నింటిలోను (పాఠ్యగ్రంథాలతో సహా) లక్ష్మీకాంతం కమిటీ నిర్దేశించిన ఆధునికప్రమాణభాషనే (వ్యావవారికాన్నే ఉపయోగించాలని నిర్దేశించారు (5,27, పే 19)). రాష్ట్ర ప్రభుత్వంవారు ఈ సూచనలను ఆమోదించి వాటిని అమలుపరచటానికి 'తెలుగు అకాడమి' అనే సంస్థను 1968 ఆగష్టు 6 న స్థాపించారు. ఆ సంస్థవారు ఇంటర్మీడియట్‌. పాఠ్యగ్రంథాలను తెలుగులో రాయిస్తున్నప్పుడు తీరుగా భాషావివాదం తలయెత్తింది. సంఘాలూ ఉపసంఘాలూ చర్చోపచర్చలు చేసిన తరవాత శిష్టవ్యావహారికాన్నే కొన్ని మార్పులతో వాడుకచేయాలని అంగీకరించి అమలుజరిపేరు. ఆ తరవాత మళ్ళీ గ్రాంథికాన్ని పునఃప్రతిష్టించాలినే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి నెరవేరవనే ఆశాభావం ఉన్నా, భాషా శాస్త్రసంబంధి చర్చలవల్ల కాక కులవిద్వేష రాజకీయవై మనస్యాలను ఆధారంచేసుకొని జయం సంపాదించవలసిన దుస్థితికి గ్రా౦థికవాదులు దిగజారినందుకు మాత్రం విచారపడక తప్పదు. ఈనాటి రేడియోల్లో, పత్రీకల్లో, సాహితీరచనల్లో, సినిమాల్లో అనుక్షణం వాడుకలో ఉండి ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉన్న వ్యావహారికాన్ని ఏ శక్తి ఎక్కువకాలం బహిష్కరించలేదు. పరంపరగా సనానత్వానికి కంచుకోటలుగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో (ముఖ్యంగా అందులోని తెలుగుశాఖల్లో) కూడా వ్యావహారిక రచనలే చేస్తున్నవారున్నారు. శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయం తెలుగుశాఖ పిహెచ్‌.డి. పట్టానికి రాసే పరిశోధనవ్యాసాల్లోకూడా శిష్టవ్యావహారికాన్ని 1969లో అంగీకరించింది. 27-4-1973లో రాష్ట్రప్రత్వంవారు తెలుగును ద్వితీయభాషగా బోధించేటప్పుడు పాఠ్యగ్రంథాల్లో వ్యావహారిక మే ఉండాలని నిర్దేశించినా (GO MS No. 384) వాటిని తిరగరాసే అవకాశం ఈ నాటికి కలగలేదు. 1971లో ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు తాము నియమించిన ఉప సంఘంవారు 1973లో అన్ని స్థాయిల్లోను వ్యావహారికమే ఉండాలని చేసిన సిఫారసు అంగీకరించి, తమ నిర్ణయాలను ఆచరణలో పెట్టడానికి 2-11-74 న మరో ఉపసంఘాన్ని నియమించారు. అది 2-4-75న తొలి సమావేశం జరిపిన తరవాత మళ్ళీ కలుసుకోలేదు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకున్న తెలుగు పాఠ్య గ్రంథాలు ఇప్పటికీ గ్రాంథికంలోనే ఉన్నాయి. మరో మహోద్యమం ప్రళయంలాగా వచ్చి