Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

274 తెలుగు భాషా చరిత్ర

9. 10. పై పరిస్థితులకు తోడు సాహితీరంగంలో అన్యోన్యస్పర్థలవల్ల పండితకవులు రెండు వివాదాలు తెచ్చిపెట్టుకొన్నారు. వాటిలో మొదటిది పాత్రోచిత భాషావివాదం ; రెండోది ఎవరు గ్రా౦థికభాషావేత్త లనేది. ఈ రెండూ ఇంచుమించు ఒకే కాలంలో వచ్చాయి. సంస్కృతనాటకాలను అనుసరిస్తున్న కొందరిని వాటిలో ఉత్తమపాత్రలకు సంస్కృతాన్ని, నీచపాత్రలకు ప్రాకృత భేదాలనూ వాడటం ఆకర్షించింది. వేదం వేంకటరాయశాస్త్రీగారి 'నాగానంది' మనే తెలుగు నాటకంలో (1896) తొలిసారిగా నీచపాాత్రలకు వ్యావహారికభాష ఉపయుక్తమైంది. దాంతో సనాతనవాదులకూ సంస్కరణవాదులకూ జగడం మొదలయింది. ఈ విషయాన్ని పరిష్కరించటానికి 1898 డిసెంబరులో మద్రాసులో పండితపరిషత్తు చర్చలు చేసింది. నాటకరచనలో 'గ్రామ్య' పదాలను వాడరాదని వడ్డాది సుబ్బారాయుడు (రాజమండ్రి), ధర్మవరం కృష్ణమాచార్యులు (బళ్ళారి), నాగపూడి కుప్పుసామయ్య (చిత్తూరు) గారలు వాదించారు, పూండ్ల రామకృష్ణయ్యగారు నెల్లూరునుంచి నడుపుతున్న "అముద్రిత గ్రంథ చింతామణి” పత్రికలో ఎరగుడిపాటి వేంకటచలముగారు రసపోషణ ప్రధానమైన నాటకాల్లో 'పాత్రోచిత భాష' అవశ్యం ప్రయోగించదగిందని వాదించారు ( 'నాటకాదుల) యందు గ్రామ్యభాష యుపయోగింపఁదగునా' ? తగదా ? -అ. గ్రం. చిం. 1899 ఎప్రిల్‌, సం. 12, సం. 4). ఆనాటికే కందుకూరి వీరేశలింగం, కోలాచలం శ్రీనివాసరావు, వేదం వేంకటరాయశాస్త్రిగారలు రాసిన నాటకాలు పదకొండింటిలో ఈ విధానం ఆచరణకు వచ్చింది. ఈ వాదాన్ని పూండ్లవారు సమర్ధించారు. కొద్ది కాలంలోనే వ్యతీరేకభావం సన్నగిల్లింది. గ్రాంథికవాదనికి గండి పడ్డది. ఇక రె౦డో రంగం. కందుకూరివారు ఆపండితులని నిందించిన కొక్కొండ వేంకట రత్నంపంతులుగారి 'ప్రసన్నరాఘవనాటకం' గ్రామ్యతాభూయిష్టమని 1898 లో వేదంవారు తమ 'ప్రసన్నరాఘవవిమర్శునము' లో దూషించారు. వేదంవారికి కూడా గ్రా౦థికభాష సరిగారాదని గిడుగువారు 1897 లో తొలిసారిగా ప్రకటించిన 'ఆంధ్రపండిత భిషక్కుల భాషాభేషజము' అనే ఖండన గ్రంథంలో సప్రమాణంగా నిరూపించారు. సరిగా ఆ కారణంవల్లనే శిష్టవ్యావహారికాన్ని సర్వాంధ్రో పయోగార్థం వాడాలని గిడుగువారనటంతో సంకుచితవిద్యాస్పర్థ ఒక మహోద్యమానికి దారితీసింది. అంతవరకూ చర్చారూపంలో ఉన్న వాదోపవాదాలు గిడుగువారి రాకతో ఉద్యమరూపం ధరించాయి. సామినేనివారి కాలంలో ( 1840)