ఆధునికయగం .: గ్రా౦థిక వ్యావహారిక వాదాలు 275
బీజప్రాయంగా ఉన్న అభిప్రాయం ఇరవయ్యో శతాబ్ధం తొలిరోజులనాటికి ఉద్యమ రూపం ధరించగానే సనాతనవాదులూ సంస్కరణవాదులూ, తమలోఉన్న స్పర్థలను విస్మరించి గిడుగువారిమీద ఒక్కటై మోహరించారు.
9.11. ఇరవయ్యోశతాబ్దపు భాషాచరిత్రకూ వ్యావహారికోద్యమచరిత్రకూ అవినాభావసంబంధముంది. ఉద్యమారంభం 1910లో అయిందనవచ్చు. నూతన బోధనపద్ధతిని వివరించటానికి అయేడు మే నెలలో విశాఖలో సమావేశపరిచిన ఉపాధ్యాయులను పనిలోపనిగా గిడుగువారు వ్యావహారిక రచనలను ప్రోత్సహంచమని, వాటిని పాఠ్యగ్రంధాలుగా అనుమతించమని అభ్యర్థించారు. భావంలో, భాషలో, ఛందస్సులో నూతనమార్గాలు తొక్కిన గురజాడ అప్పారావుగారి 'నీలగిరి పాటలు, ముత్యాల సరాలు' ఆయేడే ప్రచురితమయినాయి.. గురజాడవారు గిడుగు వారి వాదాన్ని సమర్థిస్తూ నవంబరు 24 న 'గ్రామ్యశబ్దవిచారణ' మనే వ్యాసం, సంవళత్సరాంతంలోగా 'వాడుకభాష-గ్రామ్యము' అనే వ్యాసం రాశారు. వీటితో గ్రాంథికవ్యావహారాల్లో ఏది ఉపాధేయమన్న వాదన శాస్త్రచర్చగా పరిణమించింది.
9.12. గిడుగువారివాదంలో ప్రధానమైన సిద్దాంతాలు నాలుగు : (1) సామూహిక విద్యాసౌకర్యాలకు కావ్యభాష చాలదు. (2) శాస్త్రగ్రంథాలను, వచన రచనలను శిష్టవ్యవహారభాషలో రాయటమనే సంప్రదాయం మనకుంది. దాన్ని పరిహరించరాదు. (3) ఆధునిక విద్యాబోధన పద్ధతికి శిష్ణవ్యవహారభాషే తగింది. (4) గ్రాంథికభాష పండితులకే రాదు దాన్ని అభ్యసించటం కష్టసాధ్యం. అందరు విద్యార్థులకూ ఆ భాషాజ్ఞానం అక్కరలేదు. సూరిగారి వ్యాకరణం కావ్యభాషను కూడా పూర్తిగా వర్ణించలేదు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని మన పూర్వకవి ప్రయోగాలను దిద్ది ప్రచురించటం నేరమని గిడుగువారు వాదించారు. మద్రాసు విశ్వవిద్యాలయం సెనేట్‌లో తమకున్న పలుకుబడిని ఉపయోగించి. గిడుగు గురజాడలు వ్యావహారికరచనలు పాఠ్యగంధాలుగా ఉండవచ్చునన్న ప్రభుత్వ నిర్ణయం సంపాదించారు. (20-9-1912 నాటి G. ౦. Ms. No. 3098). వారి వాదాన్ని అంగీకరించిన మొదటితరం అనుయాయుల్లో ఒకరైన నెట్టి లక్ష్మినరసింహంగారు రాసిన 'గ్రీక్పురాణకథ' లనే పుస్తకాన్ని స్కూల్ ఫైనల్ విద్యార్థులకు ఉపవాచకంగా నియమించటంతో పెద్ద సంచలనం బయలుదేరింది. ఈ గ్రంథం అర్థగ్రాంథికంలో కృతిమ వ్యావహారికంలో ఉండి నిశితవిమర్శల పాలై