పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

262 తెలుగు భాషా చరిత్ర

= ఈతనిచే (చిం. ఛా. రా. V 94), అతగానికి (పా.క.శు. II 190), ముసలామె (పై. III 48), వాటి వాని (చెం.కా.రా. IV 64), మతి నెంచి నీబిడ మహిమ లెట్టివియొ (కం. నా. వి. II 42), పనిలేంది (అ. నా. హం. V-78), ఈ వేల్పు వెలదిమంది (కం. పా. ఉ. IV 5౦), పెళ్ళికొడుకు (గో. కూ. సిం. పద్యం. 90), విళ్ళు = విండు (కా. మ. ష. II 102), ఒళ్ళు = ఒడలు (క.వ. రా. Vol. II పుట. 146), ఇంట్లోకి (అ.నా. హం. III 91), పనిలేంది = పనిలేనిది (పై.ది. V 73), అదేమే = అది + ఏమే. (చిం. ఛా.రా. IV 88), ఏందెలె = ఏమిటే + లే (పై.IV 98), మళ్ళిరాదొ(వి. నా. ర. పుట 42), వరస (అ. నా. హం. II 162).

8.33. అవ్యయాలు : వెనక (క. వ.రా. Vol. II పుట, 15). తరవాత (పై. పుట. 34), కనక (ప రం. ఉ. I 21). పై మూడుమాటలు ఉత్వ మధ్యాలుకాని ఉచ్చారణ విధేయంగా అత్వమధ్యాలై నవి. ఒకసారి, ఈ పారి (కం. పా. ఉ. III 54, VI 39), ఇంగితం బేరుగక యీలాగుబల్క (వి. నా. ర. పుట. 43), ఈలాగు మంత్రమారుత (అ. నా. హం. III 65), చిలుకలు నీలాగు పలుకనేర్చె (కం. పా. ఉ. IV 198), చాలా వేలాగుల బతిమాలిన (కూ. తి. ర. III 81), అలాగె (పా. క. శు. II 457), ప్రొద్దుగూఁకుదాఁక (కా. మ. ష. III 125), ఆతల = ఆవల (పై. VII 45), కొండ యెక్కెడు బ్రతిమాలు కొద్ది నీవు (గో. కూ. సిం. పద్యం. 17), వేళ్ళెగననైన బుద్ధి దిగసన వచ్చు (పై. పద్యం. 19), ఆనిక - ఆవెనక (ఋ. వేం,చం. III 86), కలిగె నూరికె నాకు కామాతురునకు = ఊరక (క. వ, రా. Vol. II పుట. 5), అషు ఇషు బోవకే = అటుఇటు (స.వెం. అ. I 69), వాజపేయ ఫలంబు నలదషే = వలదటే (పైది. I 69), నగరికి బోవకే నడుమ నెషులొ = ఎటులొ (పై. I 68), అవునషే (పా. క. షు. II 459), కాదషే (పై. II 477). పైన పేర్కొన్న ఐదు ప్రయోగాలు ఛాందసులై న వైదికుల మాటలు. ఇవి వర్గమాండలికాలకు (class dialects) ఉదాహరణాలు.

8.34. క్రియలు, భావార్థకాలు : చేసుట (క. వ. రా. Vol. II పుట. 80), మెఱుపులు మెఱుసుట (కా. అ. అ. II 196), దున్నకము = దున్నుట (బి. తి. అ. I 90). పైవానిలో చివరి ప్రయోగం పాలమూరు మండల౦ మాండలికం.