Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యభాషా పరిణామం 263

ఆ మండలంలో వచ్చుకము, ఇచ్చుకము, పెట్టుకము, తినుకము వంటి మాటలు శిష్టజనవ్యవహారంలో ఉన్నవి. ఉండ్రా = ఉండుమురా (స. నా. అ. I 100).

8.35. కావ్యభాషలో సరళాదిగా సరళమధ్యంగా ఉండవలసిన కొన్ని మాటలు పరుషాదిగాను పరుషమధ్యంగాను ఈయుగపు కావ్యాలలో కనుపడుతున్నవి. ఇవికూడ నాటి ఆయా మండకాల ప్రత్యేకతలు కావచ్చును.

పరుషాది : పొడ చింక తోలు కచ్చడమదేంది = జింక (ర. భూ. రా. II 145). మన నిఘంటువులలో జింకశబ్దమే కనుపడుతది. ద్రావిడభాషాపరమైన దీని మూలరూపం పరుషాదిగానే ఉండేదేమో. ఇంత ప్రాచీనరూపం కావ్యాలలో ప్రవేశించిందంటే మాండలికంగా ఉన్న ప్రాచీనరూపానికి అప్పటికీ చాలినంత వ్యవహారబలం ఉండాలె.

పరుషమధ్యముం : ముసుక్తు = ముసుగు (పా. క. శు. IV 188). తెలంగాణంలోకూడ ఈనాడు దీనిని పరుషంతోనే వ్యవహరిస్తారు. తెకటార్చెను శౌరి యనుచు = తెగటార్చెను (లిం. శ్రీ. స. IV 126); వెకటున్‌ గరగరిక పుట్టు = వెగటున్‌ (పై. IV 170). పై రెండుదాహరణాలు ప్రాసఘటితంగాకూడ ఉన్నవి. ఆ, క్రాంత శరీరుడై యెదురుకట్లకు వచ్చినరెడ్డి (అ. నా. హం. IV 172], అటుకులు దిన్నట్లేనా (స. నా. రా. I 39).

8.36. ఇతర వ్యవహార భాషాలక్షణాలుగల ప్రయోగాలు కొన్ని ఈ యుగపు కావ్యాలలో ఉన్నవి.

(క) స్వరభక్తి (Anaptyxis) : సంయుక్తాక్షరాలనడుమ ఒక అచ్చును చేర్చి ఉచ్బారణం సులభంచేసుకోవటం. ఉదా : సమరత = సమర్త (పా.క.శు. I 452), గాఢముగా పరుషించె = వర్షించె. (ప. రం. ఉ. III 20).

(చ) దీర్ఘాచ్చుకు హ్రస్వాచ్చు : వీనులు ముయవచ్చి = మూయవచ్చి (అ.కా.II 104), కొప్పున నున్నగా నియదు = ఈయదు (అ. కా. II 220).

(ట) వర్ణనాశము (Syncope) : రెండు హల్లుల నడిమిఅచ్చు ఉచ్చారణ త్వరలో నశించి రెండు హల్లులుకలిసి వర్ణసమీకరణం ఏర్పడటం. ఉదా: ఉర్ల = ఉరల (కం. పా. ఉ. III 8), తెప్పిర్లి = తెప్పరిల్లి (పై. III 353), ఎర్కు =