పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యభాషా పరిణామం 261

తెలుగుదేశం బయట అంటే తంజావూరు మధుర మొదలైనచోట్ల తెలుగుల వలసలు ఏర్పడినప్పుడు అక్కడి మాండలికాలు ఆ ప్రా౦తపుకవుల రచనలలో చోటు చేసుకోవటం సహజమే. ఈ మండలికాలను ప్రా౦తీయ మాండలికాలనీ (Regional dialect words), వర్గమాండలికాలనీ (Class dialect words) విభజించుకోవచ్చు. ఇవి ఆనాటి భాషా స్వరూపంతో పాటు వ్యవహారబలాన్ని కూడ నిరూపిస్తవి. ఈ యుగపు కవుల కావ్యాలలో కనబడే తీరుతీరుల మాండలికాలను ఈ దిగువన ఉదాహరిస్తున్నాను.

8.32. విశేష్యాలు : సర్వనామాలు : విశేషణాలు : గడె (పా. క. శు. I 247), పిడుక కుంపటులు (పై. I 254), ఎల్లుండి (పై. II 183), అతగానికి (పై. II 190), పదిమాళ్ళకు (పై. III 137), చేయప్పు = Hand Loan (పై. III 241) , గరికెవ్రేళ్ళు (క.వ. రా. vol. పుట 18), రేతిరి (కా.మ.ష.II 56), తొట్ల (పై. VI 37), అసలు = బురద (కా. మూ. పాం.I 73), కొమాళ్ళు (పై. III 28), కుమార్తె (అ. నా. హం. II 114), పోరి = (నింద్యార్థమున) బాలిక (రె. మ. గం. II 220), మంగళార్తులు (పై II 255), వెళుపు = వెడల్పు (కూ. జ. చం. I 90), కడేలు (పైది. II 88), ఊసుపోవక (పై. III 9). అఘాత్యము (ఋ. వెం. చం. I 85), ఫలహారము (కం. పా. ఉ. IV 198), చెల్లెలికట్ట (పై. III 24), బైట (పై. I 20), తునెలు (ప.రం. మ. I 64), చౌలు = చెవులు (లిం. శ్రీ. స IV 5), గద్దిగ (వి. నా. ర. పుట. 80), బంట్రోతు (అ. నా. హం. IV 84, 168), ఆడకు = అక్కడికి, (వి. నా. ర. పుట. 42), ఏడకు = ఎక్కడికి (అ. నా. హం. V 248), ఈడ = ఇక్కడ, ఆడాడ = అక్కడక్కడ (కం పా. ఉ. IV 115, 116), దూరమేడది =దూరమెక్కటడిది (ర. భూ. రా. II 174), ఆఁటది = స్త్రీ (పా.క. శు. II 279), కుండలు వెళ్ళవేయించే ననగ = వెల్ల (అ. నా. హం. II 100), ఓనమాలు = ఓనమాలు (పై. III 141), ముత్తేలు = ముత్యాలు (చెం. కా. రా. II 33, విడిద =విడిది (పా. క. శు. I 425), నాకాడ = నాకడ (కా. అ. ఆ. I 124), సోద్యవడి (ప. రం. ఉ. I 36), బంగారు పావాలు (పై. II 3), అచ్చుతునకు (పైది. III 102), కళావతెమ్మ (ప. రం. మ. I 46), అచ్చుతుకునితోడి తెమ్మని (స. వెం. రా. I 8), మేదించినట్టి ఈబూదియేంది = ఏమిటి (ర.భూ-రా. II 145), లక్షాయాభైై వేలు, ఎనబై వేలు, నలభై యొకవేలమాళ్ళు (వి. నా. ర. పుట. 27), ఈనచే