కావ్యభాషా పరిణామం 257
ఉ III 15). ఇందులో చూచితే అనేది నేటిచూస్తే అనే రూపానికి మధ్యరూపం. మగవాడైతే (స. వెం. అ. I 104), ఆకర్షింపగలిగితే (స. వెం. అ. II 84), బాళినిజేరితే (చి.సిం. బి. II 128), వదరితే (లిం. శ్రీ.స. III 97), క్రోలగల్గితే, కదియింపగల్గితే, నఱుమంగగల్గితే (స. వెం. అ. II 84), అల్లితేనేసరా, పాడితేనే సరా, మీటితేనేసరా, ఆడితేనేసరా (స. వెం. రా. I 50), కన్నులైతేసరే, వదనమైతే సరే, రూపమైతేసరే (స. వెం. అ. II 8), మిమ్మంపితే (వి. సా. ర. పుటి 48).
8.22. విధ్యర్థకాలు : విధ్యర్థక క్రియారూపాలలో వ్యవహార స్వరూపం నిరూపించే కొన్ని ప్రయోగాలు నాటి కావ్యాలలో కనుపిస్తవి. ఇవి సంప్రదాయ వ్యాకరణ నియమాలకు విరుద్ధమైనవి. ఉదా: వాకిలిదీయని పిల్చెవల్లభన్ (అ.నా.హం. II 56). గడియదీయ్యని (అ. నా. హం. III 98), ఇందులోని తీయి + అని సంధిగమనార్హము. నా కియ్యమనిన = నాకు + ఈయుము + అనిన (అ. నా.హం. V 73), ఇటువంటి ప్రయోగాలు ఈనాడు సాగరసీమలో బహుళం. కాని తెలంగాణంలో ఇది అభిప్రేతార్థానికి విరుద్ధం. తేలంగాణంవారు దీన్ని నాకు + ఈయము + అనిన అని అర్థం చేసుకొంటారు. ఇటువంటిదే చూడమటన్న = చూడుము + అటన్న రూపం (కం. నా. వి. పుట. 21),
8.23. అకప్రత్యయాంతాలు : ఆత్మనే పదార్థంలో భూతకాలిక అస మాపక క్రియారూపాలలో వచ్చే '-కొని'కి -క/కు/కొ అనే పరిణతరూపాలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నవి. ఇందులో '-కు' మరీ ఆధునిక రూపం, ఈ మూడు రూపాలకూ ఈ యుగపుకావ్యాలలో ప్రయోగాలు లబిస్తవి. ఉదా: (1) ఎత్తుకపోయి, చేతఁబుచ్చుక, సంతరించుక, నిలుపుక, పట్టుక, చూచుక, అలముక, అందుక (క. వ. రా. vol. II పుటలు. 6,19,26,27,28,208,72), తోడుక (ర. భూ. రా. II 174), తప్పించుక, తప్పుక (సు. మా. చం. I 159, IV 86), పూనుక, పఱచుక, కఱచుక, కట్టుక (అ. నా. హం. I 45,182, 193,260), కాపెట్టుక (అ. నా. హం. II 111), తెచ్చుక, ఎత్తుక (కం. పా. ఉ. III 102, IV 200), ఊదుకపోవు, చూచుక, తప్పించుక, పట్టుక (చే. వెం.వి. I 34, II 31, 195, 198), ఉంచుక, కాచక (పా. క. శు. I 50, 128), తన పాదము బట్టుక (కా. అ. అ. పీఠిక. 21), వంచుక, ఎక్కుక, తాల్చుక (కా. అ. అ. I 107, IV 318), అందుక (బి. తి. అ. IV 11), కప్పుక, ఉంచుక
(17)