258 తెలుగు భాషా చరిత్ర
(లిం. శ్రీ. స. III 67, 68), తోడుక (చి. సిం. బి. III 169), అనుక (ప.రం.ఉ. III 92), (2) చూరుబట్టుకు, బుద్ధితెచ్చుకు (గో. కూ. సం. పద్యాలు 41,45). -కుతో వచ్చే ఈ రెండోతీరు రూపాలు ఒక్క గోగులపాటి కూర్మనాధుడే ప్రయోగించినాడు. తక్కినవాళ్ళెవరూ ప్రయోగించలేదు. (3) కాముడు కోపించి యిటకు గదుముకొ రాగా (కా. మ. ష. IV III )'. -కొ తో వచ్చే ఈ మూడోతీరు ప్రయోగంకూడ ఒక్క కామినేని మల్చారెడ్డి మాత్రమే వాడినాడు.
8.24. సందేహార్థక, నిశ్చయార్థక, సంభావనార్థత ప్రత్యయాలు చేరి నప్పుడు అజంతశబ్దాలమీద నిత్యసంధి చేయటంకూడా ఈ యుగపు కావ్యాలలో కనుపిస్తుంది. ఉదా : పొంగలో పొంగలి (చే. వెం. వి. III 41), అటో యిటో యెటో (చే.వెం.వి. III 84). ఎన్నగ పండోకాయో (ప. రం. మ III 77).
"బంతే చన్గవ నిగ్గుమేను రుచి పోల్పన్ జాళువా మేలుడాల్
దొంతే కన్నుల ధాశధశ్యరుచులెంతో కల్వకున్ జూడమేల్
బంతే కంతుని దంతినేలు నడలున్ బాగైన యీ భామకున్
ఎంతేలేదు సమానమెంచుటకుగా నీ రేడు లోకంబులన్"
(స. వెం. అ. II 29)
గ్రహించేయన్నారు (చి. ఛా. రా. IV 141), ఎంతోకరముప్పతిల్ల (చి. సిం. బి. II 77), కరికిన్ దొడ్డా (ఎ. బా. మ. పద్యం. 18), విజయరాఘవమేదినీవిభుని చెయ్యె మీదటంచును (ప. రం. మ. V 69), శశిరేఖ యందాన సకలకళా ఫ్రౌఢా (స. వెం. అ. III 35), అతనిమీదిదె బాశియగుచు నుండు (చెం. కా. రా. III 69), ప్రాకృతమునె అయినట్లాయెనా (కా. అ. అ. పుట. 30), నిదురామరి కంటికి రాదు. (కా. మ. ష. IV 103).
8.25. సముచ్చయార్థక ప్రత్యయస్థానంలో నేటివ్యవహారంలోవలె దీర్ఘాచ్చు రావటంకూడ నాటి కావ్యాలలో ఉన్నది. ఉదా: మఱీమించే (చిం. భా. రా. I 67). తోచియుండినా లేదనేటి (చిం. భా. రా. III 65), ఎగాదిగ సరసిచూచి (అ. నా. హం. V 73), లక్షాయాబై వేలు (వి. నా ర. పుట. 27), నోరునోరే తెఱచున్ (పా. క. శు. II 162), పదివేలయినా (స. వెం. అ. I 114), తగిలి నానుతగులు తప్పిన తప్పును (స. వెం. రా. I 60), బాపనికేమయినాను తెల్సునా (లిం. శ్రీ. స. III 90), పనియెడగల్గినా (లిం. శ్రీ. స. III 135), వనితలనిట్లా తలచుకొని (లిం. శ్రీ. స. III 62).