Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

256 తెలుగు భాషా చరిత్ర

ఉన్నవి. -ఎదను > - ఏఅన్‌ పరిణామం కూడా ఆ ప్రాంత వ్యవహారంలోనే వచ్చింది. ఆయా రూపాలన్నీ వ్యవహారబలంవలన నాటి కావ్యభావలో ప్రవేశించినవి. ఉదా. వినిపించేరు, ప్రశంసించీని (వి. నా. ర. పుట. 4), పెట్టేము, తెచ్చేము, ఇచ్చేము, చేసేము (కా. మ. ష. II 98), చచ్చేవే, చెడేవు (కూ. జ, చం.II 70, 141), ఇచ్చేను, ఎంగిలయ్యీని (స. వెం. అ. I 68, III 104), వెలకుఁగొనేరా. మొక్కేను, (ప.రం.మ. III 16, IV 12). గుండె యదరీని (లిం. శ్రీ. స. III 42), విషమాస్తుడేచీని వెఱ్ఱిపడుచ, ఇంద్రుడే మిచ్చీని (స.వెం.అ.I 69).

8 19. తద్ధర్మార్థక విశేషణాలు : -ఎడి/-ఎడు అనే తద్ధర్మార్థక ప్రత్యయాలకు వ్యవహారంలో _ఏ (టి) అనే రూపాలున్నవి. ఇవికూడ అనాటి కావ్య భాషలో కనుపిస్తున్నవి. ఉదా : ఎఱిగేటట్టయితే (అ. నా. హం. II 128), వచ్చుచ్చుఁబొయ్యేటి (అ. నా. హం. II 162), విటకోటి నెనసేటి (అ. నా. హం. III 74), వారిజాడల మెలగే (చెం. కా. రా. I 9), కృశియించేదెంచ (కా. మ. ష. III 140), అచ్చటనడచే వింతలు (స. వెం. రా.I 8), వేళలుగాచే (లిం.శ్రీ. స. IV 180), తిరి పెంబెత్తేవానికి (స. వెం.రా. I 65), మెలతలుచేసే (లిం.శ్రీ.స.IV 98).

8.20. ఉభయ ప్రార్ధనం : కావ్యభాషలో ఉభయ ప్రార్థనంలో వచ్చే దుగాగమానికి (క్రియా-30) మారుగా -(ఉ) దము, -(ఉ)దాము, -తము, -తాము మొదలైన ప్రత్యయరూపాలు గల ప్రార్థనాద్యర్థక క్రియలు భిన్నమండలాలలో భిన్నరూపాంతరాలలో ప్రచారంలో ఉన్నవి. వీటిలో కొన్ని నాతి కావ్యభాషలో స్థానం సంపాదించుకొన్న వి. ఉదా : 'చూతాముగా' (కా. మ.ష. V 107), చూతామా, కందమా, చందమా (చనుదమా). (కా. మ.ష.V. 115), వెదకు దాము (ప. రం. ఉ. III 107).

8.21. చేదాద్యర్థకాలు : -ఇన(న్‌) అనే కావ్యభాషా చేదర్ధక ప్రత్యయానికి -(ఇ)తే (ను) అనేది వ్యావహారిక రూపాంతరం. ఈ యుగపు కావ్యాలలో (ఇటువంటి వ్యావహరిక రూపాలు కొల్లలుగా కనుపిస్తవి. ఉదా : 'గట్టిగ నీమగడెఱిగేటట్లయితే' (అ నా. హం. II 128), కేశికైతేను (అ. నా. హం. II 166), అంపించితే (గో. కూ. సిం. పద్యం, 10), చూచితే, నొక్కితే, మీటితే, కూడితే, (ప.ర౦.