Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యభాషా పరిణామం 255

ణా౦ద్ర వ్యవహారంలోను రాయలసీమ పలుకుబడిలోను ఉన్నటువంటిదే కాని సాధారణ వ్యవహారంలోనిది కాదు. అప్పకవి 'మెఱుపులు మెఱుసుట' (కా.అ.అ. II 196) అన్నాడు. 'వెళ్ళగొట్టుచు' (కూ. జ. చం. I 64) అనేప్రయోగంలోని ధాతువు అంతస్సంధి వలన 'వెడలు' అనే ప్రాచీన ధాతురూపంనుంచి వర్ణ సమీకరణం ద్వారా ఏర్పడిన రూపమే. ఇది శిష్టవ్యవహార సాధారణమేకాని కావ్యభాషా సాధువుకాదు. 'వెళ్ళ గొట్టింప దలచి' (అ. నా. హం. II 100), 'రెండు దుక్కులు వెళ్ళదున్ని' (అ. నా. హం. V 35), 'వెళ్ళగనె' (కా. మ.ష VI.84), 'వెళ్ళదోలిన' (రె. మ. గం. II 164), “తలగడ సంచులవలె వెళ్ళి' (పా. క. శు. II 30), 'వెళ్ళె' (కా. మూ. పాం. V 47) మొదలైన వివిధ రూపాలన్నీ ఈ కాలవు కవులు వాడినవే.

సమాపక క్రియలు : తెలియు, విడుచు, చంపు అనే కావ్యభాషా రూపాలకు తెలుసు, విరును, సంపు అనేవి వ్యవహార రూపాలు. వీటిలో మొదటిది శిష్టవ్యవహారంలోను తక్కినవి పామర వ్యవహారంలోను ఉన్నవి. ఈ రెండు తీరుల రూపాలను ఈ యుగంలోని కవులు వాడినారు. ఉదా. తెలుసు (చిం. చా.రా. V 22). విరుసు, సంపు (కా. మ. ష. II 60) అనే మాటలు సూసివచ్చినారు, కఱసి, విడుసు మొదలైన మాటలు ఇందులోనే కవి బోయలనోట ఎరుకులనోట పలికించినాడు.

ద్విరుక్త అద్విరుక్త చకారాంత ధాతువులకు సవర్జాంతరూపాలు వ్యావ హారిక భాషలో బహుళ ప్రచారంలో ఉన్నవి. కావ్యభాషలో ఇవి నిషిద్ధాలు. కాని ఈ యుగపు కవులు వీటినికూడా ప్రయోగించినారు. వస్తాడా, తెస్తాడా, చూస్తుడా, ఇస్తాడా అనేవి అప్పకవి (I 125) గ్రామ్యోక్తులన్నాడు. కాని కూచి మంచి జగ్గకవి (కూ. జ. చం. II 83) నీలాద్రి రాజంతవాడు వస్తాడనీ, ధనం తెస్తాడనీ, చ౦ద్రరేఖకు ఇస్తాడనీ లేకపోతే విరహంతో చస్తాడా అనీ అన్నాము.

8.18. భవిష్యత్క్రియలు : 'లాట్టురుఞ్ఞ పరంబగునపుడెదగాగ మంబును, బ్రథమ సువర్షకంబు పరంబగునపుడెడుగెడిగాగమంబులును బహుళంబుగా నగు' (క్రియా-23) అని సూరిగారి సూత్రము. ఈ ఆగమాలకు మారుగా వ్యవహారంలో -ఏను/ -ఈని ; -ఏరు; -ఏవు ; -ఏము అనే రూపాలున్నవి. వీటిలో ఈకారఘటిత రూపాలు దక్షిణా౦ద్ర వ్యవవహారంలోనే బహుళంగా