కావ్యభాషా పరిణామం 245
లోహంబు కరణి (చి. సిం. బి. I 149), శ్రమాంబు చెక్కులన్ (అ.కా. II 48). 'అంబువు' అనవలసినచోట పై ఉదాహరణలలో చిత్రకవి సింగరార్యుడు, అహోబలపతి 'అంబు' అన్నారు. తత్సమ పదాంత వుగాగమం బహువచనానికి ముందు లోపించిన ఒక విశేష ప్రయోగం నాటి కావ్యభాషలో లభిస్తున్నది. ఉదా. వస్తు లెవ్వని యి౦ట విస్తరిల్లు (బి. తి. అ. I 78, 117). ఐతే "పునర్ణకేతర విభక్తి పరమగుచోనుకారాంతంబులకు బహుళంబుగా గోశబ్ధంబునకు నిత్యంబుగా వుగాగమంబగు" (తత్సమ-49) సూత్రంతో దీన్ని కూడ సరిపెట్టుకోవచ్చునేమో.
8.5. సమాసగతమై ఇకారాంతమైన 'తోడ' ప్రత్యయానికి రూపాంతర మైన 'తోడి'కి వ్యావహారిక రూపం 'తోటి' నాటి కావ్యభాషలో స్థానం సంపాదించుకొన్నది. ఉదా: హరియించును తోటి హాలహలముంబోలెన్(చిం.ఛా.రా. IV. 157).
8.6. పంచమ్యర్థంలో వాడే 'ఉండి'కి వ్యవహారంలో వినిపించే 'నుంచి' నాటి కావ్యభాషలో కనుపిస్తున్నది. 'పూని వదాన్యులంచు౦దమ భూముల నుంచి (చిం. ఛా. రా. III 64). చిన్నయ సూరిగారు దీనిని 'సాధుకవి ప్రయోగారూఢంబు గాదని యెఱుంగునది' (కారిక-11. కారిక) అన్నారు. పంచమీ విభక్తి ప్రత్యయం 'వలన'కు వ్యావహారిక రూపాంతరం 'వల్ల' ఈ యగంలో చాలామంది కవులు వాడినారు. ఉదా. 'కల్ద నావల్ల గోరంత గలిగెనేని' (చే. వెం. సా. II).
8.7. షష్టీ ప్రత్యయమైన 'కు' కు ముందు నగాగమం స౦ప్రదాయ వ్యాకరణ విధేయం. 'కువర్ణకంబు పరంబగునవుడు కార ఋకారంబులకు నగాగమంబగు' (తత్సమ-28) అని చిన్నయనూరిగారు. కాని నాటి కావ్యభాషాలో నగాగమం రాని రూపాలు అనేకం. ఉదా : 'నీ మనసుకె తోఁచివచ్చు ననుమానము లేదిక' (చిం. బా. రా. III. 168), 'ఆర్తరక్షణ బిరుదుకు హానివచ్చు' (గో.కూ.సిం.పద్యం. 16), 'శేషుకైన' (రె. మ. గం. II. 115). షష్టిప్రత్యయం 'లోపల' అనుదానికి 'లో' రూపాంతరం. దీని దీర్ఘానికి తెలంగాణం వ్యావహారికంలో హ్రస్వం రావటం హెచ్చు. ఈ హ్రస్వరూపం కూడి నాటి కావ్యభాషలో కనుపిస్తున్నది. ఉదా. 'వార్టిలొ' (రె. మ. గం. II 166).
8.8. 'ఒద్ద' అనే అర్ధంలోని 'కడ' అనుబంధానికి వ్యావహారిక రూపమైన -కాడ అప్పకవీయంలోనే దొరుకుతున్నది. ఉదా. నా కాడ (పుట 126). ఐతే