Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

244 తెలుగు భాషా చరిత్ర

కాలపు కావ్యాలలో అమహదేకవచన ప్రత్యయం 'ము' వైకల్పికంగా వచ్చే అసాధారణ పదాలు కొన్ని కనుపిస్తవి. ఉదా. క్రొత్తసూరెపుటంపుగుఱుచ గద్దిగము (వి. నా. ర. పుట. 30). చిన్నయసూరిగారిని (అచ్చిక. 2) అనుసరించి దీనిని క్లీబసమంగా ఎంచుకొని 'ము' వచ్చిందని సమర్థింపదలచుకొంటే ఈకవే మరొకచోట కటికవారలు పల్క గద్దిగ డిగ్గి (వి.నా.ర పుట. 307) అని ప్రయోగించినాడు. ఒకే పదాన్ని ఒకచోట స్త్రీసమంగాను మరొకచోట క్లీబసమంగాను చెప్పుకోవటం బాగుండదు. ఛందోనిర్బంధం మూలంగానో, నాటి వ్యవహార బలం చేతనో కవి ఆవిధంగా ప్రయోగించినాడనుకోవాలె. ఇదే విధంగా ప్రాచీన కావ్యాలలో 'సయ్యాట'గా ఉన్న మాటకు ప్రబంధకాలం నుండి 'సయ్యాటము' అనే రూపాంతరం కనుపిస్తున్నది. ప్రకృత పరిశీలనలో ఉన్న యుగంలోకూడ లాక్షణికులైన కవులే ఈ మాటను 'ము' ప్రత్యయంతో వాడినారు. ఉదా. సయ్యాటములను (అ. కా. II 89). 'ము' ప్రత్యయం లోపించిన పదాలు కూడ కనివిస్తవి. ఉదా. బలిమినైనను దీనిబట్టి భోగింప వలయుఁగా కిఁక డాఁప వశగాదు మమత (కం.నా.వి. IV పుట. 91). చందాల సంసర్గ సలిపినావు (కా.మ.ష IV 98). వశము, సంసర్గము అనవలసినచోట్ల వశ, నంసర్గ అనటం జరిగింది. చిన్నయ సూరిగారి "చరిత్రాదుల మువర్ణకంబునకు లోపంబు బహుళంబుగానగు” (తత్సమం-59) అనే సూత్రంతో వీటిని సవరించుక పోవచ్చునుగాని వీటికి అంత గొప్ప 'చరిత్ర' లేదేమో. పులకలు అనివలసినచోట పులకములు అని మువర్ణం చేరిన ప్రయోగాలుకూడ ఉన్నవి. ఉదా: మురుపున రూపుమై పులకముల్‌ మెఱసెన్‌... ద్విరేఫముల్‌ (ప. రం. ఉ. III 30). శబ్ద రత్నాకరకారుడు 'పులకము' అనే మాటకు వేరే అర్దాలిచ్చినాడు కాని గగుర్పాటు అనే అర్థం ఇయ్యలేదు. గగర్పాటు అనే అర్ధం 'పులకలు'కు ఇచ్చినాడు. మీదుమిక్కిలి "తెఁనుగున నిది స్త్రీసమముగాను బహువచనాంతముగాను బ్రయోగములం జూపట్టెడు” అన్నాడు. నాటి సాహిత్యభాషలో ఉదంత ఆమహచ్చబ్దానికి వు గా గమం వచ్చిన విశేషరూపమొకటి దొరుకుతున్నది. ఉదా: కల్గెను బోతువచ్చటన్‌ (అ.నా. హం.V 33). 'ము' ప్రత్యయం స్థానంలో వైకల్పికంగా వు గా గమం వచ్చిన రూపాంతరం మరొకటి లభిస్తున్నది. ఉదా. పుట్టువును కాలమును కర్మవును (క.వ. రా. vol. II పుట. 233). ధర్మువు వలె కర్మువుకూడా వ్యాకరణం ప్రకారంగా సాధువేకాని ప్రయోగబాహుళ్యంలేదు. తత్సమశబ్దాలలో నిత్యమైన వుగాగమం లోపించిన నిదర్శనాలుకూడ ఉన్నవి. ఉదా. అంబు మ్రింగిన తప్త