కావ్యభాషా పరిణామం 243
ఉదా. మొగలీ వజ్రీడు (లిం. శ్రీ. స. III 54). నిత్యవ్యవహారంలో వచ్చే అన్య దేశ్యాలు గరీబు, గలీజు, గలీబు మున్నగు పదాలలో వచ్చే వర్ణం ఇదే.
z (ں) వర్ణాన్ని తెలుగు 'జ' తో ముడిపెట్టినారు. ఇది నాదాత్మకమైన దంతమూలీయోష్మం. కాని మనవాళ్ళు నాదాత్మకమైన తాలవ్య స్పర్శంతోనే సరిపెట్టుకొన్నారు. ఫార్సీ, అరబీ భాషలలో ఈ ధ్వని సామ్యం కలవి (ڌ), (ڋ), (ڞ) (ڟ) నాలుగు వర్ణాలున్నవి. ఇందులో (ݬ), (ڟ), (ڞ) ఈ మూడు వర్ణాల ఉచ్చారణ మరీ సన్నిహితంగా ఉంటది. వాటిలోని సూక్మభేదాన్ని ఆ యా భాషలు మాతృభాషగా కలవాళ్ళు గుర్తిస్తారేకాని ఉర్దు మాట్లాడేవారు కూడ వ్రాతలో భేదం పాటించినట్లు ఉచ్చారణలో భేదం పాటించరు. (ݬ) వర్ణాన్ని మాత్రం కొంచెం భేదంగా ఉచ్చరిస్తారు. తెలుగువాళ్ళు మాత్రం ఈ నాల్గింటిని 'జ' లోనే కలిపినారు. ఈ యుగం కవులు ఈ వర్ణాలు వచ్చే అన్యదేశ్యాలను అధిక సంఖ్యలోనే వాడినారు. ఉదా. పంచదారను దిను బాబా వజీరు (వి.నా.ర.పుట. 45), కమ్మగేదగి నేజ గైకొని మరుడు (వి. నా. ర. పుట. 63). వాలుగల సవాలు (సు. మా. చం.II 58), పంచాంగములు చెప్పి బజారు లోపల (అ. నా. హం.II 153), ఉరుబాబు (చిం. ఛా. రా. IV 181), జులుముల సందడుల్ (స. వెం. రా. I 110), హుజురు పాటకు (లిం. శ్రీ. స. IV 60), రాచ వజీరు (లిం. శ్రీ. స. II 8).
నామ ప్రత్యయాలు
8.4. ప్రథమైకవచన ప్రత్యయం చేరటంలో ఈ యుగపు సాహిత్య భాషలో కొంత వైవిధ్యం కనుపిస్తున్నది. అవ్యాకృత రూపాలైన వీటికి నాటి మాండలిక వ్యవహారమే ఆధారమై ఉండవచ్చు. వ్యాకరణం ప్రకారంగా మహదేక వచన ప్రత్యయం డుజ్ రావలనిన చోట్లకూడ అది రాని సందర్భాలు కొన్ని ఈ కాలపు కావ్యాలలో ఉన్నవి. ఉదా. చండు మున్నగు గ్రహోచ్చయములు (కం. నా.వి. III 50). దీనికి విరుద్ధంగా డుజ్వర్థతం రాగూడని స్థలాలలో వచ్చిన నిదర్శనాలు ఉన్నవి. అందులోను ఇవి అన్యదేశ్యాలలో రావటం మరొక విశేషం. ఉదా. వజీరుండు (స.వెం.అ. I 52), మొగలీ వజ్రీడు (లిం. శ్రీ. స. III 54). నిజంగా ఇక్కడ ఉత్వమేచాలు. డుజ్వర్జకం కాప్రత్యయంతో కలిసి అనుద్ధిష్ట శబ్దాలలో కనుపించటం ఇంకొక ప్రత్యేకత. ఉదా. కైవల్యంబునకుం గాణాచి కాండ్లగు (పా. కా.శు. IV 162). తలారి కాండ్లు (కా. అ. అ.II 196). ఈ