Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

246 తెలుగు భాషా చరిత్ర

దీనిని అప్పకవి గ్రామ్యానికి ఉదాహరణంగా చెప్పినాడు. 'ఒద్ద' కు ఔపవిభక్తిక రూపం 'ఒద్ది' అనే మాటకూడ కావ్యాల కెక్కింది. ఉదా : 'నీరజనాభుఁడొద్ది తరుణీతతి' (ప. రం. ఉ. III. 118).

8.9. మహద్బహువచనంలో అదంత దీర్ఘ పూర్వలోపధం కాని శబ్దాల మీద కూడ 'రు' ప్రత్యయం నాటి కావ్యాలలో కనుపిస్తున్నది. ఉదా : 'సూతుర నదలింపుచు (చిం. ఛా. రా. VI. 103). ఇది ప్రాస స్థానంలో ఉన్నది. 'కూతు శబ్దము ప్రథమైక వచనంబునకు రు వర్ణ౦బగు (అచ్చిక-9) అని చిన్నయ సూరి గారి అనుశాసనం. సూరిగారు కుతురులు, కూతుళ్ళు, కూతురి అనేవి గ్రామ్యాలన్నారు. ఐనా వ్యవహారబలం మూలంగా మహాకవుల కృతులలోనే వాటికి ప్రయోగాలున్నవని కీ. శే. గిడుగు రామమూర్తి పంతులుగారు తమ బాలకవి శరణ్యంలో నిరూపించినారు. ఈ యుగంలో వర్ధిల్లిన లాక్షణికకవి అహోబలపతి కూడా 'సొంపుల కూఁతురి' (అ. కా. II. 104) అన్నాడు.

అమహద్బహువచన రూపాలలో నాటి కావ్యభాషలో ఈ కింది సంధిగత రూపాలు కనిపిస్తవి. ఇవి వ్యవహారభాషకు సన్నిహితంగా ఉంటవి.

-డ్ (అచ్చు) + లు >- ళ్ళు

'మూడు లక్షల మాళ్ళకు, నలభై యొకవేల మాళ్ళు' (వి. నా. ర. పుట.27). 'ఒళ్ళలోఁ గడితంబు లొప్పుగా మనిచి' (వి. నా. ర, పుట, 51), వంకలను, డొంకలను బీళ్ళ, వాళ్ళ, గుప్పలను, దిప్పలను, మళ్ళ, గుళ్ళ, నూళ్ళ (అ. నా. హం. I. 189), గుళ్ళు పంచల పసుల గాళ్ళను (రె. మ. గం. II. 177).

-ర్ (అచ్చు) + లు > - ళ్ళు దాసళ్ళు (మ. రె ష. V. 14)

పైళ్ళు (కా.మ. ష, 11. 42).

-(దీర్ఘాచ్చు) + లు > - ళ్ళు ఱాాళ్ళ (అ. నా. హం. I. 189),

దీర్ఘా౦తమైన అన్యదేశ్యాల తుది ఇకారానికీ బహువచంలో ఉకారాదేశం రాకపోవటం వ్యవహారభాషాపద్ధతి. దీనికి నాటి కావ్యభాషలో నిదర్శనం. దొరుకుతున్నది. ఉదా. ఫిరంగీలు (సం వె. అ. II. 95). సూరిగారు 'ఇత్తునకు బహువచనంబు పరంబగు నపుడుత్వంబగు' (తత్స. 45) అని తపరకరణం చేయటంతో శ్రీలు, స్రీలు, లకోరీలు మున్నగు వాటివలే ఫిరంగీలు కూడ సాధువే.