Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్య భాషా పరిణామం 237

(HGT, 132), ఉదా: పువ్వుంతోంట, పూందోంట, నల్లంజెఱ్వు, గొఱ్ఱెం గదుపులు.

మహద్వాచకాలపై కూడా ఈ ఆగమం చేరడం శాసనభాషలో కనబడు తూంది. ఉదా: గంగమారాణి కూతురుం చింగాసాని (SII VI 777, విశాఖజిల్లా, క్రీ.శ. 1461).

7.36. క్రియావిశేషణాలు : ఆ, ఈ, ఊ అనే సర్వనామ ప్రాతిపదకల నుంచి ఏర్పడ్డ క్రియా విశేషణ రూపాలు ఎన్నో, అక్కడ, ఇక్కడ, అప్పుడు, ఇప్పుడు ఇత్యాదులు వాడుకలో ఉన్నాయి. ఆ, ఈ, ఏ (త్రికం)తోపాటు ప్రాచీన ద్రావిడభాషలో మాధ్యస్థాన్ని బోధించే 'ఉ' ప్రాతిపదిక ఒకటి ఉండేది. దీని నుంచి ఏర్పడ్డ 'ఉల్ల' (అల్లదుగో,ఇల్లిదిగో -అనే వాటిలో స్థలవాచకాలైన అల్ల, ఇల్ల రూపాలవలె) రూపాలకు భారత ప్రయోగాలున్నాయి.

కావ్యభాషలో క్రియావిశేషణాలగు అవ్యయాలకు ఉదాహరణాలు : మొగి, ఒయ్య, నెమ్మి, ఓవి, క్రచ్చఱ, పరువడి. శాసనాల్లో ఇటువంటివి కనబడవు. వస్తు భేదం కారణం కావచ్చు.

ఔపమ్యాన్ని బోధించే అవ్యయాలు : కరణీ, భంగి, మాడ్కి, నడువు, పోలె-ఇత్యాదులు. రెండేసి రూపాలు కూర్చి చెప్పడంకూడ కావ్యాల్లో కనిపిస్తూంది. కుమారసంభవంలో ఉదాహరణాలు : అట్టువోలె, కరణిలోలె, చాడ్పునవోలే, తెఱగవోలె, పగిదివోలె, పొలుపువోలె, భంగివోలె, మాడ్కి వోలె, వడువువోలె,

సంస్కృత రూపాలు అనంతర యుగమందలి కావ్యాల్లో అధికంగా ప్రవేశిం చాయి; ఉదా : వృధా శపింతురే (మనువ.) శాసన భాషలో - ఈ యుగాని చెందిన దానిలో - ఉదాహరణాలు కలవు. నివేద్యానకు త్రివాదా ..... ఇస్తిమి (SII VI 46, కర్నూలు జిల్లా).

ఈ క్రింది రూపాల్లో కనబడే క్త్వార్ధకాల వాడుకవిధానం తెలుగు జాతీయ మనే చెప్పాలి. నన్నయ : వందురి వగచుచున్న (భార. 1-5-30), వ్రచ్చివధింతు గాక (పై. 1-6-201), వ్రచ్చి వంతఱలాడు (పై. 1-2-101), పట్టిపాలా ర్పగనేల, వగచి వనరుచుండె (పై. 7-209).