పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

238 తెలుగు భాషా చరిత్ర

నామాల నుంచి క్రియా విశేషణాలను నిష్పన్నం చేయటానికి అగుధాతువు అన్నంత రూపం 'కాన్‌' చేర్చబడుతోంది. 'కాన్‌' > - గాన్, కన్‌, గన్‌. క్వాచిత్కంగా కావ్యభాషలో నామం ఈ సహాయక క్రియారూపం లేకుండానే క్రియావిశేషణంగా వాడటం కనబడుతోంది. నన్నయ : అమరభావంబున సుఖంబు జీవి౦తురటె. (భార. 1-4-151), అరుంధతి సహితంబు నిరంబరలయి (కు.సం. 10-31).

నన్నయాది ప్రాచీన గ్రంథాల్లో ధ్వన్యనుకరణ శబ్దాల.కొన్నిటి వాడుక జాతీయం అనాలి. మలమల మఱ౦గుచు (భార. 1-3-111); వడవడంకుచు (1-2-55); వడవడవడకుంచు (1-2-55). ఇట్టి వాడుక సర్వత్ర ఉంది. కొన్ని కొన్ని వాడుకలు మాత్రం ఇప్పుడు మారాయి.