236 తెలుగు భాషా చరిత్ర
తూములు వదిన్ని (SII V 1052, గుంటూరు జిల్లా, క్రీ. శ. 1133), (2) సముచ్చయ ప్రత్యయం లోపించి (లోపించక) ప్రాతిపదికలోని చివరి అచ్చు దీర్ఘ౦ కావటం. ఉదా. అతని పుత్రాను పౌత్రికమూ ఎల్లప్పుడూను ఆరాధించువారు. (SII x, 4, గుంటూరుజిల్లా, క్రీ. శ. 1003) _ ఈ రెండు పరిణామాలు జరిగాయి. వీటికి కవిత్రయ యుగం కావ్యభాషలో ప్రవేశ౦ కలగలేదు.
(3) ప్రశ్నార్థకం : ఎ/ఏ ప్రత్యయాలు. రాజు సామాన్యునిగా వగచితే (భార. 1-1-176), కాముశక్తి నోర్వగలరె జనులు (కు.సం). ప్రశ్నార్థకాలైన ఉండునె, చనునె, కొనునె అనేవి సంయుక్త క్రియల్లో ఉన్నె, చన్నె, కొన్నెగా మారకాయి. 13 వ శతాబ్దం నుంచి 'ఎ' తో పాటు 'అ' ప్రత్యయం వాడుకలోకి వచ్చింది. క్రమంగా ఇది వ్యాప్తిచెంది 'ఎ' లోపించింది. నన్నయ నన్నిచోడులలో 'ఎ' ప్రత్యయమూ, తిక్క.నలో ఎ/ఎ తోపాటు 'ఆ' వాడబడింది.
7.35. విశేషణాలు : తెలుగులో ఇతర ద్రావిడభాషల్లోలాగానే, ఒకే రూపక విశేషణంగాను విశేష్యంగాను వాడే స౦ప్రదాయంకలదు. కనుకనే విశేషణ 'అ' ప్రత్యయంతో కూడిన 'నల్ల' రూపాన్ని నన్నయ 'నల్ల' విశేష్యంగా వాడాడు. నల్ల లేదయ్యెనేని (భార. ఆది). ఇట్లే చిఱ్/చిన్ ధాతువుమీద 'అ' చేరగా చిఱ్ ఱ్-అ > చిట్ట. 'చిట్ట వెదుళు' లని నన్నిచోడుని ప్రయోగం (కు. సం. 12.121): చిన్న; ఇ ప్రత్యయంతో 'చిట్టి', చిన్ని రూపాలు. సామ్యంవల్ల 'టి' ఇతర శబ్దాలపై చేర పిన్నటి, తక్కటి రూపాలేర్పడ్డాయి. పిన్నటి నవ్వు (కు. సం. 8.10), తక్కటి పుత్రులు (భార.) వండెడు/వండెడి ఇత్యాది తద్ధర్మక ధాతుǽ విశేషణం వ్యవహారంలో 'టి' ప్రత్యయం చేర్చుకొని 'వండేటి' 'చేసేటి' రూపాలేర్పడ్డాయి. వండే, చేసే మొ వి. కవిత్రయయుగం తర్వాత కావ్యభాషలోకి ఎక్కినాయి.
పేర్వాదులకు అచ్చు పరమైప్పుడు టుగాగమం విభాషగా అవుతుందని బాలవ్యాకరణ సూత్రం. పేరురము, 'పేరుటురము. ప్రాచీనకావ్యాల్లో టుగామం రాని రూపాలే అధికం. -ట్- సామ్యంవల్ల వీటిలో చేరిందని చెప్పబడిందికదా.
ఉదంతస్త్రీసమాలకు పరుష సరళాలు పరమయినప్పుడు నకారాగమం రావటం కావ్యభాషలో కంటే శాసనభాషలో ప్రచురంగా కనబడుతున్నది.