కావ్య భాషా పరిణామం 229
కు. సం. 11-106). దీని ఔపవిభక్తిక రూపం ఒక్కంటి, ఒకటి. ముద్రిత భారత ప్రతులలో ఒకటి, ఒక్కటి రూపాలు కనబడుతున్నా తాళపత్రప్రతుల్లో పాఠాంతరాలున్నాయనీ, వీటిని ప్రథమ రూపాలుగా వాడియుండడని ఆంధ్రభాషా చరిత్రకారు లూహించారు. కుమారసంభవంలో “ఒకటి” అనే దానికి ప్రథమలో ఒక్క ప్రయోగం కనబడుతోంది. 'మానుగ గూర్తు నొక్కటిగ మార్గణకౌశల భావమేర్పడన్ (4-69) పదో శతాబ్దంనాటి దొంగలసాని శాసనంలో 'నళ్పాద్యది యొకొటియగు నేణ్డు' అను ప్రయోగాన్ని బట్టి ఈవాడుక భాషలో ప్రాఙ్నన్నయ యుగంలోనే ఏర్పడిందని స్పష్టపడుతోంది.
మహద్వాచకం : నన్నయ-ఒకరుఁడు, ముద్రిత ప్రతుల్లో కనబడే ఒక్కఁడు. ఒకఁడు లోపానికి తాళపత్ర ప్రతుల్లో రేఫతోకూడిన వేరుపాఠాలు కన్పిస్తున్నాయని ఆంద్రభాషాచరిత్రకారులు (HTL.p. 1415). నన్నెచోడుడు ఒకఁడు/ఒక్కండు రూపాన్ని మహద వాదర్థములు రెండింటిలోను వాడిఉన్నాడు.. ఒకఁడు శబ్దం మొదట అమహద్రూపమైనా (< ఒక + ఒన్జు) దానిలోని-డుజ్ వర్ణం మహద్వాచకం అనే బ్రాంతి కల్సింపడంవల్ల ఈ అర్థంలో వాడుకలోకి వచ్చి ఉంటుంది. అప్పుడు ఆర్థసందిగ్ధతను నివారించడం కోసం దీని ఔపవిభక్తిక రూపమైన ఒకఁటి ప్రథమలో వాడుకలోకి వచ్చి స్థిరపడి ఉండవచ్చు. 12-13 శతాబ్దాలనుండి శాననాల్లో తరుచు 'ఒకటి' ప్రథమలో వాడబడింది.
మహతీ వాచకంగా నన్నయ ఒక్కత, ఒక్కటి, ఒక్కతె, ఒక్కర్తు అనే రూపాలను వాడినాడు, సూరి మహతిలో 'ఒకతి' శబ్దానికి 52 రూపాంతరాలు పేర్కొన్నాడు. చాలావరకివి సామ్యంవల్ల కూర్చబడ్డాయని తోస్తుంది. ఇవి ఎంతవరకు కవిప్రయుక్తాలో పరిశీలించవలసి ఉంది.
పూరణార్థకసంఖ్యా వాచకంలో వచ్చే ప్రత్యయం అగు > అవు. అవు నన్నయలో ఉంది. 'అగు' ప్రాఙ్నన్నయ శాసనభాషలో వాడబడింది. 'అవు' రూపమేర్పడ్డ తర్వాత దీనిపై విశేషణత్వ 'అ' కారంచేరి "అవ' ఐంది. కావ్య భాషలో తరచుగా కనబడే రూపమిదే. _అవ వ్యవహారంలో పన్నెండు శతాబ్దానికే 'ఓ' గా మారినట్టు శాసన ప్రయోగాలవల్ల తెలుస్తుంది. ప్రబంధ యుగంలోని కవులు 'ఓ' రూపం వాడిన వాళ్ళున్నారు.