Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

230 తెలుగు భాషా చరిత్ర

7.26. క్రియావిభక్తులు : ప్రాచీన కావ్యాల్లో క్రియాధాతువులను గూర్చి ఈ కింది విశేషాలు గమనించ తగ్గవి.

1. ధాత్వనుబంధము చేరని ప్రాచీన ధాతువుల వాడుక. ఉదా : తొడు (భార. 1-8-174; కు. సం. 5-20) ఎదురు (కు. సం. 4-46). తెప్పిరు (10-10). తొడుగు, ఎదిరించు, తెప్పిరిల్లు అని తిక్కనాది అనంతర కవులు వాడారు.

2. చుకారాంత ధాతువులు కొన్ని తరువాతి కాలాన యకారాంతాలైనాయి. నన్నయ నన్నిచోడులు: వైచు, త్రోచు. అనంతర కవులు : వేయు, త్రోయు, ప్రాఙ్నన్నయ యగంలో ఴచ్చు ధాతువు ఇలాంటి పరిణామానికీ ఉదాహరణం. 7-8 శతాబ్దాల్లో ఴచ్చు-చుకారాంతము : ఴచ్చిన వాన్ఱు ఴచ్చువాన్ఱు (రేనాటి. చోళశాసనాలు), 9 వ శతాబ్ధంనుంచి ఴయ్యు : ఴస్సి (ఇయ్యొట్టు ఴస్సి) బెజవాడ శాసనం (HGT. 311, శాసన౦ పంక్తి 14). అఴసి : లింగంబఴసిన పాపంబు (పంక్తి 21). కొన్ని ధాతువుల్లో చుకారాంత, యకారాంతాలు రెండూ ఏకకాలంలో వాడుకలో కనబడుతున్నాయి. నన్నెచోడు : పాచు/పాయు, మెఱచు/మెఱయు, రాచు/రాయు.

3. మూలధాతువులుగా వాడబడ్డవి కొన్ని తరువాతి కాలంలో సహాయక క్రియలతో శబ్దపల్లవాలుగానే వాడబడ్డాయి. ఉదా : వ్రేలు (కు. సం. 11-127) ఉలుకు (2-14), వ్రేలాడు, ఉలికిపడు.

4 వలయు వంటి క్రియలు కవిత్రయం ప్రధానక్రియగా వాడారు. ప్రపంధయుగానికిది కేవలం సహాయ క్రియగా వాడబడింది. ఏమివలతు నీవడుగు మనిన (కు.సం. 1-70), పోయిరావలయు మాకు ( = పోయిరాన్‌ మాకువలయు) (భార. ఉద్యో. 1-42).

ఇక శబ్దదిస్వరూపంలో ప్రాచీనతాలక్షణం ఆ యుగంలోని రూపాల్లో తత్రాపి నన్నయ నన్నిచోడుల గ్రంథాల్లో కనబడటం ఆశ్చర్యంకాదు. ఉదా: తూర్పు (కు. సం. 8-94) > దూరు, నచ్చు (కు. సం. 10-189), (భార. ఉద్యో. 3) > నమ్ము, నఱకు (నఱుకు) మొ.వి.

నన్నయాది ప్రాచీన గ్రంధాల్లో కొన్ని ధాతువులు ఎలాంటి రూపభేదమూ లేకయే అకర్మక, సకర్మకాలుగా కూడా వాడబడ్డాయి. ఉదా : కురియు : అంగార