Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

228 తెలుగు భాషా చరిత్ర

గదలనేరకున్నవాడ (భార. 3-8-245). షష్టి ప్రత్యయానికి పూర్వం నగాగమం రాని రూపాలు నన్నిచోడుని రచనలో ఉన్నాయి. ఉదా : సభముకు (11-169). నన్నయలో ఒకచోట తాకు కు అనురూపం కనబడుతున్నది (భార. 3-4-12).

7.24. సర్వనామాలు : ఉత్తమ, మధ్యమపురుష సర్వనామాల్లో ఏక బహువచనాలు రెండింటను రెండేసి రూపాలు ప్రాచీన కావ్యాల్లో వాడబడ్డాయి.

ఏను-నేను; ఏము-మేము; ఈవు-నీవు; ఈరు-మీరు. క్రమంగా అజాది రూపాలకి కావ్యభాషలోనూ వాడుక తగ్గిపోయింది. ఉత్తమపురుష బహువచన రూపం నేము-(తమిళమున నామ్‌-అనుదాని సమానపదం) భారతంలో ఒకచోటను (3-5-200), అర్వాచీన కావ్యాల్లో ఒకటి రెండుచోట్ల వాడబడింది. శాసనాల్లో దీనికి ప్రయోగాలు కలవు (HGT. P. 179),

ప్రాచీనకాలంలో అత్మార్థక రూపం మూడుపురుషల్లోనూ. వాడబడుతూంది. ఉత్తమపురుషలో వాడుక కుదాహరణం : తన్ను బంపుదేవ (కు. సం. 4-45).

తచ్చబ్ద-వాడు, అది, ఇది రూపాలకు నన్నయ నన్నిచోడుల భాషలో నేటివలె నీచార్థస్పురణ మేమీలేదు, ఉదా : వీడు భీముడు, వాఁడు గవ్వడి (భార. 2-1-193). దమయంతిని గూర్చి చెబుతూ "అది సంతసించి" (భార. 3-2-202), వీడు సామాన్య పురుషుండుగాఁడు (కు. సం. 7-16) వరదుండు. దాని కోరిన వరంబు దయసేసి (పై. 7.72)

నన్నయ 'వారు' బహువచన రూపాన్ని వాడినాడు. సమకాలీన శాసనాల్లో వా౦డ్రు రూపమంది. వాఁడు శబ్దాన్నుంచి ఏర్పడ్డవాండ్రు నన్నయ అనంతర కవులు వాడినారు. వాండ్రు రూపంకన్నా అర్వాచీనం వాండ్లు > వాళ్ళు,

7.25. సంఖ్యావాచకాలు : నన్నయ, నన్నిచోడలు 'ఏను' రూపాన్నే వాడారు. అయిదు 12, 13 శతాబ్దాల నుండి శాసనాల్లో, కావ్యభాషలో కనబడుతూంది. ఉదా : తిక్కన : ఐదు శరంబులు (ద్రోణ 3-223),

మొదటి సంఖ్యావాచకానికి మహత్‌, మహతి, అమహత్‌ రూపాలు మూడూ ఉన్నాయి. అమహద్రూపమే సంఖ్యావాచక విశేష్య౦. ఉదా : అమరత్వ మొక్కండు. దక్క (భార. 1-8-88), ఉగ్రబాణసమూహ మొక్కండు దప్పక