పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకరణం 7

కావ్యభాషా పరిణానుం

(క్రీ.శ. 1000-1599)

_కోరాడమహాదేవశాస్త్రి


పూర్వరంగం

7.0. నన్నయ ఆంధ్ర మహాభారత రచనకు ఉపక్రమించేసరికి తెలుగులో కావ్యశైలి అన్నది అప్పటికప్పుడే ఏర్పడి ఉంది. పాజ్నన్నయ యుగంలోని కొన్ని తెలుగు శాసనాలు పరిశీలించి చూస్తే ఈ విషయం స్పష్టమౌతుంది.

వచనరూపంలో తెలుగుభాష మనకు శాసనాల్లో ఆరోశతాబ్దం చివరి ప్రాంతంనుంచి లభిస్తున్నది. ఆరు, ఎనిమిది శతాబ్దాల నాటి శాసనాలు, రేనాటిచోళులు, తూర్పు పశ్చిమ చాళుక్యులు, చాణరాజులు వేయించినవి -అన్నీ గద్యలోనే ఉన్నాయి. తొమ్మిదో శతాబ్దంనుంచి గద్యశాసనాలతోపొటు పద్యశాసనాలుకూడా లభిస్తు న్నాయి. పద్యశాసనాల్లో ఎక్కువభాగం తూర్పు చాళుక్యరాజులకు చెందినవి. ఇంతవరకు కనబడిన వాటిలో మొట్టమొదటి పద్యశాసనం గుణగ విజయాదిత్యుని సేనాపతి పండరంగని అద్దంకి (గుంటూరుజిల్దా) శాసనం (EI 13,271-5). తెలుగు మహా భారతంలాగానే ఇదీకూడ గద్యపద్యోభయమైన చంపువులోఉంది : తరువోజ ఛందస్సులో ఒక పద్యం, తరువాత నాలుగు పంక్తుల గద్య. పద్య భాగంలో పండరంగని పరాక్రమోపేతాల్తైన విజయాలూ, గద్యభాగంలో పరమ మాహేశ్వరుడైన అతడు ఆదిత్యభటారనికి చేసిన దానాలూ తెలుపుతుంది. ఇతర పద్యశాసనాలు అక్కర, సీసం మొ.న దేశీయ చ్ఛ౦దస్సుల్లో రచించబడి ఉన్నాయి. పద్యశాసనాల్లోని భాష అంతా చక్కని కావ్యశైలిలో ఉంది. యుద్ధమల్లునీ బెజవాడ శాసనం (EI15.150-9).