పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

205

ల్లోని క్రియ నామపదానికి విశేషణంగా మారటంవల్ల ఏర్పడ క్రియాజన్య విశేషణాలతో తెలుగులో సంబంధ బోధక వాక్యాలేర్పడతాయి. ఉదా: యీ ప్రతిష్ట చేసినవారు గౌతమ గోతృలు (NI 3 ఒంగోలు 13.17-20.1778).

6.50. నామ్నీకరణాలు : ఒక వాక్యం కొన్ని మార్పులు చెందటంవల్ల మరొక వాక్యంలో కర్తృస్థానాన్ని వహంచటాన్నే నామ్నీకరణం అంటారు.

సంబంధార్థక నామ్నీకరణం : వాక్యంలోని సమాసక క్రియ నామపదానికి విశేషణంగా మారటమే స౦బంధార్థక నామ్నీకరణం. ఉదా. పాపయ చెక్కిన శాసనం (<- పాపయ శాసనం చెక్కిన్నాడు) (SII 5.1262 21,1873). సంబంధబోధక వాక్యాలలో కర్తృస్థానం వహించే క్రియాజన్య విశేషణాలు ఇలాంటివే (§ 6.49).

అటం:- అటం చేరటంవల్ల కొన్ని వాక్యాలు వ్యాపార బోధక నామాలుగా మారుతున్నాయి. ఉదా. ఈ శిలాశాసనం చెక్కించడం (NI 2 కందుకూరు 48.45,1650). అది: అది చేర్చడంవల్ల కూడా కొన్ని వాక్యాలు నామ్నీకృతాలవుతున్నాయి. ఉదా. .... ఆ పరిమివారు తాండి కొండ పొలము గరకసా చేసేది యేమిపని (SII 10.759.26-27, 1663).

6.51. అనుకృతి : ప్రత్యక్ష, పరోక్ష భేదాలతో అనుకృతి వాక్యాలు ఈ కాలపు శాసనాల్లో చాలా అరుదు .. నీవు ... కీర్తిచ౦ద్రుడితో ... వివాదకు వచ్చినావా? అని కోపంచేసి .. (SII 6.13-14,1796) అని ప్రశ్నవాక్యాన్ని చేర్చుకున్న అనుకృతి వాక్యం ఒకటి కనిపిస్తుంది. ఈ కింది వాక్యంలో “అని” విషయార్థ బోధకం. ఊళవారు అపరిమివారు లేని గరకసా చేస్తున్నారని మాల్ము చేసిరి (SII 10.759.19-22,1663).

6.58. సంయుక్త వాక్యాలు: సమప్రాధాన్యం గల రెండు గానీ, అంతకంటె ఎక్కువగానీ సామాన్య వాక్యాల కలయికవల్ల ఏర్పడే సంయుక్త వాక్యాలు ..... మల్లరుసున్ను ..... శ్రీపతిన్ని యీ శాసనం వ్రాసిరి (SII 8.495.5,1516) వంటివి ఇంతకు ముందు కాలంలోని శాసనాల్లో దొరుకుతున్నా ఈ కాలపు శాసనాల్లో వాటికి ఉదాహరణలు కనిపించడం లేదు. పై వాక్యంలో సముచ్చయార్థకం-న్ను|-న్ని రెండు వాక్యాలను సంయోజనం చేయటాన్ని, రెండు వాక్యాల్లోను సమాన వ్యాపారాన్ని సూచించే క్రియలలో ఒకటి లోపించటాన్ని చూడవచ్చు.