పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యభాషా పరిణామం

207

"స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర! విస్తర శ్రీయుద్ధమల్లుణ్డనవిద్య విఖ్యాత కీర్తి! ప్రస్తుత రాజాశ్రయుణ్డు ద్రిభువనాభరణుణ్జు సకల వస్తుసమేతుణ్జు రాజసల్కి భూవల్లభుణ్డత్తి౯న్‌ ...”

ఈ తత్సమ బహుళమైన భాష పద్యశాసనాల్లోనే కాదు, గద్యశాసనాల్లోనూ కనబడుతుంది. తొమ్మిదో శతాబ్దంనాటి విజయాదిత్యుని ధర్మవరం (నెల్లూరుజిల్లా) శాసన (భారతి 5, 613-20) భాష ఎంత సరళగంభీరమైన శైలిలో ఉన్నదో చదివి చూడండి. ఏవో కొన్ని ఆకాలానికి విహితమైన ధ్వనులు రూపాలు మాత్రం మనకిప్పుడు విలక్షణంగా తోచవచ్చు. కాని ఇది మొత్తం మీద భారత శైలికి సన్నిహితంగా ఉంది.

“విజయాదిత్య పాదపద్మ బ్రమరాయమాన శ్రీమత్‌ కడెయ రాజు దనకెని ఈశ్వరునకుం గాత్తి౯ కేయండుంబోలె చౌషష్టికల విసార దుణ్డయ్న ఆయ్యపయ్యయు సకలశాస్త్రాద్ధ౯ పారగులయ్న పెద్దపణ్డరంగులు అయమ పెగ్గ౯డలుంగరనమ్మున పణ్డరంగును ఈధమ్మ౯నివ్వ౯హనోద్యోగమ్మునకు బృహస్పతి సమానులయ్న పెగ్గ౯డ కడెయగారి కొడుకు బెజెయరాజు సమర్థుణ్డని ఆత్మాన్మతంబునం బన్చిన ప్రసాదంబని సమస్త రాజ్యభిర నిరూపిత మహామంత్రాధిపతి మహేశ్వర పక్షపాతి దేవబ్రాహ్మణగురుభక్తపరుణ్ణు సక్తిత్రయ సంపన్నుణ్ణు మయ బెజయరాజు బెజయేశ్వరంబుగల పని విద్య౯హానంబు సేసి...”

ఇట్టిదే, ఇంకా రాటుదేరిన శైలి క్రీ. శ. 892-922 నాటి కొరవి (వరంగల్‌ జిల్లా) గద్యశాసనం (శ్రీ నేలటూరి వేంకట రమణయ్య గారి పాఠము) లో కనిపిస్తూంది.

“శ్రీ వికమాదిత్య నృపాగ్రతనయుణ్ఞయ్న చాళుక్య భీమునకు శౌచకందప్పు౯నకు వేంగీశ్వరునకు రసమద్ద౯న్వయ కులతిలకుణ్ణయ్న గన్నర బల్లహునిక స్తప్రాసంబయ్న రణమద్ధ౯ కంఠియందన భుజవీయ్య౯ బలపర్మాకమంబునందెచ్చి కంఠియంగట్టి పట్టంబెత్తి ఖఱ్గసహాయుండైై వేల యెల్లంగావంబూని మంచికొకణ్డనాణ్డాందిగ వెంగిదేసము విష్ణువద్ధ౯నుతో సద్ధ౯ రాజ్యంబు సేయుచున్న కుసుమాయుధు పెద్దకొడుకు...”

పద్యశాసన కాలానికి పూర్వం తెలుగుభాషా లేఖనాలు లభించిన ప్రారంభదశలోనే పై పద్యగద్యశాసనాల్లోని శైలిని పోలిన శైలిలో రచింపదడ్డ గద్యశాసనం లభించడం విశేషం. పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి విక్రమాదిత్యుని తురిమెళ్ల (కర్నూల్‌ జిల్లా) శాసనం (AI 29, 160.164) 657 సంవత్సరంలో వేయబడింది. ఈ శాసన పాఠం ఇది.