192 తెలుగు భాషా చరిత్ర
మార్పు చెంది ఉండాలి. ఉదా. ఏంటి -కి (<ఏంట్టి <*ఏంట్ -త్తి) (ప్ర వి.ఏ౦డు) (SII 10 758.85, 1600), వాకిట -ను (<వాకిట్టి <*వాకిల్ -త్తి) (ప్ర. వి. వాకిలి) (SII 7. 564.7.1667). నీటి (ప్ర. వి. నీరు) NI 3 రాపూరు 74.11,1638 సాదృశ్యంవల్ల ఏర్పడ్డదై ఉండాలి. ఇల్లుకు ఇంటి ఔప విభక్తిక రూపంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉండే ఔప విభకక్తిక ప్రత్యయం కూడా -తి కి సంబంధించిందే అయి ఉండాలి. పుట్టింటి -కి (<-ఇంటి <ఇన్‌ణ్ణి <*ఇల్-న్ - త్తి) (ప్ర. వి. పుట్టిల్లు) (NI 3 రాపూరు. 7.8,1638). 15, 16 శతాబ్దుల నుంచే కనిపిస్తున్న పడమట -ను (SII 5.103,13,1408), తిరువీడు -లో (SII 8.536.15.1585) వంటి ఔప విభక్తిక ప్రత్యయం చేరని రూపాలు ఆధునిక రూపాలు. రెండవ రకం నామ ప్రాతిపదికలు (ఔప విభక్తికాలు) మొదటి రకం నామ ప్రాతిపదికలతో కలిసి పోతున్నాయనటానికి ఇది నిదర్శనం. 11వ శతాబ్ది నుంచీ సంఖ్యా వాచకాలమైన -ఇ (౦) టి చేరటం చూశాం (§ 8.88; రాధాకృష్ణ § 4.58). సంఖ్యా వాచకాలసైనే కాకుండా ఇతర ప్రాతిపదికలకు కూడా ఇది చేరటం 15 వ శతాబ్ది నుంచి చూడవచ్చు (§ 5.28). ఉదా. పేరిటి (ప్ర. వి. పేరు) (SII 5 874.11,1620). (g) బహువచన ప్రత్యయం -లు పైన -అ ఔప విభక్తికంగా చేరుతుంది. ఉదా. బ్రాహ్మల -కు (SII 5. 1260. 18,1604). (h) మానవ వాచక బహువచనం -రు పైన -ఇ చేరుతుంది. ఉదా. వారి -కి (SII 5.874.17,1620).
6.27. విభక్తులు : (1) ప్రథమావిభక్తి: ప్రథమావిభక్తికి ప్రత్యేకమైన ప్రత్యయాలు లేవు. సాధారణ౦గా కర్త ప్రథమావిభక్తిలో ఉంటుంది.
(2) ద్వాతీయావిభక్తి : -ను/-ని ద్వితీయావిభక్తి ప్రత్యయం. -ని ఇకారా౦తాలపైన -ను ఇతర్శత చేరుతాయి. ద్వితీయావిభక్తి కర్మార్థాన్ని వ్యక్తం చేస్తుంది. ఉదా. పాపాన్ని చెందుదురు (NI 2 కందుకూరు 48.79, 1650-51). అప్రాణి వాచకాలకు ఈ ప్రత్యయం నిత్యం కాదు. ఉదా. కవులు శిలాశాసనం వ్రాసిరి (SII 10.769.22-27,1681).
(3) తృతీయావిభక్తి : -చేత. -చే, -తో, -వల్ల తృతీయావిభక్తిలో 15, 16 శతాబ్దులలో కనివిస్తున్నాయి. (రంగనాథాచార్యులు § 5.03). ప్రస్తుతం -వల్లకు మాత్రమే శాసనాల్లో ఉదాహరణలు దొరుకుతున్నాయి. ఉదా. యీ