శాసన భాషా పరిణామం 193
కాసులవల్ల అయిన పదార్థం (SII 10.758.61,1600). ప్రాచీన ప్రయోగంగా -న కనిపిస్తుంది. ఉదా. కుతుబు పాదుషహూ వొడయలుంగారి పంపున ..యర జర్లను సాదించి (SII 10.755.3,1604 ). -తో సహార్థంలో కనిపిస్తుంది. ఉదా. వీండ్లతో పాటు (NI 2 కందుకూరు 48. 32,1650), వగైరాలతో కూడా (NI 2 కందుకూరు 48.65,1650). -తో కు పాటు కూడా చేరటం 17 వ శతాబ్ది నుంచే శాసన భాషలో కనిపిస్తుంది
(4) చతుర్దీ విభక్తి: -కు/కి, -కై, -కొఱ-కు, - కొఱకై చతుర్థీ విభక్తిలో కనిపిస్తాయి. ఇవి సంప్రదానార్థాన్ని సూచిస్తాయి. ఉదా. -అచ్చ౯ కులకు. ..ఇచ్చిన ధర్మశాసనం... (SII 5.166.4,1624). -కు/-కి అనేకార్థాలలో కనిపిస్తుంది. వచ్యర్థంలో: ...హుజూరుకు. ..మాల్ము చేసిరి (SII 10.759.52.1663). గమ్యార్థంలో : పేటకు తెచ్చే యందుకున్ను (SII 10,753.51,1600). కాలార్థంలో : యెల్దప్పట్కిన్ని (SII 10.771.11,1692). దిగర్థంలో ; చేనికి దక్షిణానను (NI 2 కందుకూరు 20.21,1640). సంబందార్థంలో : అరబ్బులకు మాతృ స్థానంపైన (SII 7.558. 9.1856).
(5) వంచమీ విభక్తి : -చేత(ను),-వల్ల(ను), -నుండి, -నుంచి, -పట్టి పంచమీ విభక్తిలో కనిపిస్తున్నాయి. -చేత(ను), -వల్ల(ను) గ్రహ్యార్థంలో రావటం గత శతాబ్దాలలోనే చూచాం (§ 4.44;5.32). -వల్ల, -లోన ల పైన నుండి చేరటం 15వ శతాబ్ది నుంచే చూడవచ్చు (§ 5.30). -మీద, -పైన -నుండి చేరటం కూడా ఈ యుగంలో కనిపిస్తుంది. ఉదా. మోకు మీద నుండి (NI 2 కందుకూరు 41.2,1683). -నుంచి, -పట్టి మొదటి సారిగా 17 వ శతాబ్ది నుంచి శాసన భాషలో కనిపిస్తాయి. ఈ రెండూ వరుసగా స్థల వాచకాలకు, కాల వాచకాలకు చేరుతున్నాయి. ఉదా. జుచ్చూర నుంచ్చి...(SII 6.227.6-7,1636), నలుభయి యేండ్ల బట్టి.... (SII 10.755.8-9, 1604).
(6) షష్టి విభక్తిలో, (7) సప్తమీ విభక్తిలో గత యగానికి, ఈ యగా నికీ చెప్పుకోదగ్గ భేదాలేంలేవు (§ 4.46). ఇంతకు ముందునుంచి కనిపిస్తున్న -కింద, -మీద, -వద్ధ(ను), -దనకా(ను) మొదలైన వాటితోపాటు -ముందట, -కిందట, -వరకు మొదలైనవి భిన్న విభ క్త్యర్థాలను సూచించేవిగా ఈ యుగంలో కనిపిస్తున్నాయి. ఉదా. ముఖమంటపం ముంద్ధట (SII 10.767.5, 1680).