పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 191

6.26. ఔపవిభక్తికాలు: నామ ప్రాతిపదికలను ప్రధానంగా రెండు విభాగాలుగా చేయవచ్చు. (1) ప్రథమా విభక్తిలో, ద్వితీయాది విభక్తులకు ముందు ఒకే విధమైన రూపం కలిగి ఉండేవి. (2) ప్రథమా విభక్తిలోను, ద్వితీయాది విభక్తులలోను భిన్న రూపాలు కలిగి ఉండేవి. ప్రభువు -తో (NI 2 కందుకూరు 41.25-26,1683), వేడ్క -తో (SII 5.1203.24,1773) మొదలైనవి మొదటి రకానికి చెందినవి. రెండవ రకానికి చెందిన నామ ప్రాతిపదికలు ద్వితీయాది విభక్తులకు ముందు కొన్ని మార్పులను పొందుతుంది. (a) పురుషవాచక ఏకవచన ప్రత్యయం -డు స్థానంలో -ని వస్తుంది. ఉదా. హనుమంతుని (SII 7.564.6-7,1667). చారిత్రకంగా -ఇ అనేదే దీంట్లో ఔపవిభక్తికం. మహదేకవచనం -డు మీద ఔపవిభక్తిక ప్రత్యయం -ఇ చేరిన ఆధునిక రూపాలు 12వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి (§ 4.40(1)). ఉదా. వాడి (NI 2 కావలి 46.16,1638). (b) -డి + ని → ణ్ణి: ఔపవిభక్తికం -డి పైన ఇ లోపించి డ,న లు పరస్పరం సమీకరణం చెందటం అంటే డ అనునాసికం, న మూర్ధన్యం కావటం 16 వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది. ఉదా. అంబారుభానుణ్ణి (SII 7.845.3,1632). (c) ఔప విభక్తికం -న కు ముందు -ము లోపించి పూర్వాచ్చు దీర్ఘం అవుతుంది. ఇలాటి రూపాలు 11వ శతాబ్దినుంచే కనిపిస్తున్నాయి. (§ 3.33 (3) (1)). ఉదా. నీరాటా -న -కు (SII 5.874.11,1620). -న కు బదులుగా -ని 13వ శతాబ్ధినుంచి కనిపిస్తుంది. (§ 4.43) ఉదా. మొట్టడా -ని -కి (SII 10,753.53,1600), (d) -ము లోపించి -న్ని చేరుతుంది. అంతకుముందు హ్రస్వం దీర్ఘ అవుతుంది. ఉదా. పాపాన్ని (NI 2 కందుకూరు 48.19, 1650). ఇలాంటి రూపాలు కూడా 12వ శతాబినుంచీ కనిపిస్తున్నాయి (§ 4.41). (c) ల, ర, న పూర్వకాలైన ఉకారాంత పదాలకు -ఇ చేరటం 12 వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నా (§ 4.40 (3)) ఈ యగంలో అవి ప్రచురం. ఉదా మొదలి (మొదలు) (SII 10 753.35,1600), కందుకూరి లో (NI 2 కందుకూరు 44. 19,1650). (f) -య్‌ (ఇ), -ల్డ్‌ (ఉ) -ల్‌ (ఇ/ఉ) -ర్‌ (అ/ఉ) (<ఱ్), -డ్‌ (ఇ/ఉ) చివరగల ప్రాతిపదికలు కొన్నిటికి -తి (య*క్త్‌ (ఇ) ) ఔపవిభక్తిక ప్రత్యయంగా చేరుతుంది. -తి కి ముందు ప్రాతిపదికలో కొన్ని మార్పులు వస్తాయి. (1) -తి -యి స్థానంలో చేరుతుంది. ఉదా. రాతి- (SII 7.845.6,1632), (ii) -డ్‌ (ఇ/ఉ), -ర్ (*-ఱ్) (అ/ఇ), -ల్‌ (ఇ/ఉ) చివరగల ప్రాతిపదికలలో ప్రాకైలుగులోనే -తి -టి గా