Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

186 తెలుగు భాషా చరిత్ర

అచ్చు లోపించిన తరువాత సమ హల్లుకు ముందు ద్విరుక్త హల్లు సరళీకృతం, అంటే అద్విరుక్తం అవుతుంది. ఉదా. కొన్నాండ్లు (-కొన్ని + నాండ్లు) (SII 10.755.7,1604).

గసడదవా దేశ సంధి క్రియాపదాది హల్లుకు మాత్రమే పరిమితం కావటం 15వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. అదైనా వికల్బమే. ఉదా: నుయి + గట్టించి (SII 10 760.9, 1660), నిర్ణయం + సేసి (SII 5.874.18,1620), బరువు + వెట్టించి (SII 10 753.32,1600).

ద్రుత ప్రకృతిక సంధి కావ్య భాషలో మాత్రమే కనిపిస్తుంది. సమకాలీన భాషలో ద్రుతాలు అస్తిత్వాన్ని కోల్పోవటంవల్ల ద్రుత ప్రకృతికాలు కళలలాగే వర్తిస్తాయి. ఉదా. సుఖాన + వుంటిమి (SII 10.772.19,1696), పందిని + కోసినట్టు (SII 10.765.42,1678).

6.19. నామ ప్రాతిపదికలు (Noun stems) : నామ ప్రాతిపదికలు మూడు రకాలు. (1) సామాన్యం (Simple), (2) సంశ్లిష్టం (complex), (3) సమాసం (Compound). సామాన్య ప్రాతిపదికలలో దేశ్యాలు, ఎరువు ప్రాతిపదికలు ఉన్నాయి. ఉదా. పేరు (NI 8 ఉదయగిరి 2?.8,1661), గోనె (SII 10.753. 52,1600) మొదలైనవి దేశ్యపదాలు. ఎరువు ప్రాతీపదికలలో తెలుగు భాషా చరిత్ర మొదటిదశ నుంచి హింద్వార్య భాషలకు సంబంధించినవి అనేకం కనిపిస్తున్నాయి. మహమ్మదీయుల పరిపాలన కారణంగా పర్సో-అరబిక్ పదాలెన్నో తెలుగులో చేరాయి. ఉదా. పరుమానా (NI 2 కందుకూరు 48.15, 1650), ఖరారు (NI 2 కందుకూరు 80.28, 1842) మొదలైనవి. ఇవి కాకుండా సోదర ద్రావిడ భాషలైన తమిళ, కన్నడ భాషలనుంచి వచ్చిన అనేక ఆదారాలు తెలుగులో కనిపిస్తాయి.

6.20. సంశ్లిష్ట ప్రాతిపదికలు : సంశ్లిష్ట ప్రాతిపదికలు కృత్తులనీ, తద్ధి తాలనీ రెండు రకాలు. (1) కృత్తులు. మూలధాతువుపైచేరే ప్రత్యయాలు కృత్తులు, (2) -పు/-ంవు : కాంవు (SII 10.753,36,1600), పంప్పు (SII 10.755.3.1604, (b) -త: అగడ్త (SII 7.84.57,1632), (c) -(౦) ట: తోంట(SII 10.755.11,1604). చారిత్రకంగా -(౦) ట - త్త నుంచే వచ్చింది. దాని పరిణామ క్రమం ఇది తోంట్ + త్త్‌ > తోణ్ ట్ట > తోంట. (d) -అటం : తవ్వటం