పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 187

(SII 7.845. 7,1632). (c) -అ: కాయ (SII 7.557.9,1645). (g) -వ: కాలువ (NI 3 రాపూరు 34.15,1630. (h) -ము ( < * -మ్సు) : నోము (SII 10.737.104, 1526), (i) -బడి : యేలుబడి (SII 10.758.10,1658). (j) -అలి : కావలి (NI 3 ఒంగోలు 102,13,1762). (k) ధాతువు ఉపధాడకారం టకారమై పూర్వచ్చు దీర్ఘ౦ అవుతుంది ; పాటు (NI 2 కందుకూరు 20.29,1640), (2) తద్ధితాలు : నామాలపైన నామ నిష్పత్తికోసం చేరే ప్రత్యయాలు తద్దితాలు. (అ) - కాండ్రు : గుత్త-గాండ్రు (NI 2 నెల్లూరు 1.31-39,1638). (b) -వారు : అంచుల-వారు (SII 10.753.47,1600). (c) -(ఇ)మి: పేర్మి (SII 10,780.5,18 వశ.). (d) -పాటు : కయిలు-పాటు (NI 3 ఒంగోలు 102.16, 1762). వీటితోపాటు పర్సో-అరబిక్ మూలకమైన-దారు అనేది కూడా తద్ధిత ప్రత్యయంగా ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా : తరపు-దారు (SII 10.777.9,1740). ఈ కాలపు శాసనాలలో కనిపించేవి మాత్రమే పైన ఇవ్వటం జరిగింది.

6.21. సమాసాలు : రెండు గానీ అంతకంటే ఎక్కువగానీ ప్రాతిపదికలు ఒకే ప్రాతిపదికగా ఏర్పడితే సమాసం అవుతుంది. సమాసాలను ఉత్పత్తిని బట్టి, అవయవపదాలకు పరస్పరం ఉండే సంబంధాన్ని బట్టి రెండు రకాలుగా విభజన చేయవచ్చు. ఉత్పత్తిని బట్టి సమాసాలను (1) దేశి-కేవల దేశ్య ప్రాతిపదికలతో ఏర్పడేవి. (2) తత్సమం-సంస్కృతం నుంచి యథాతథంగా గ్రహించినవి, (3) మిశ్రం-తత్సమ, దేశ్యాల సమ్మేళనంవల్ల ఏర్పడేవి - అని మూడు రకాలుగా విభజించవచ్చు. వీటి విషయంలో గత యుగాలకు, ఈ యుగానికి పెద్ద భేదం ఏమీలేదు. వరుసగా పై మూడింటికి ఉదాహరణలు. (1) వెల్ల-నూలు (SII 10, 753.55,1600). (2) నిత్య-నైవేద్యాలు (SII 5.1260.8,1604), (3) పడమటి-బాగానను (SII 7.790,15.1714).

6.22. సమాసంలో అవయవ పదాలకుండే పరస్పర సంబంధాన్ని బట్టి సమాసాలను ప్రధానంగా మూడు విభాగాలు చేయవచ్చు. (1) అంతః కేంద్రకాలు (Endocentric): కర్మధారయ, ద్విగు, తత్పురుష సమాసాలు ఈ విభాగంలో చేరుతాయి. ఉదా. వెల్లనూలు (SII 10.753.55,1600), మూడు తావులు, (SII 10.769.10,1691). దేవుని ప్రతిష్ట (SII 7.558.18, 1856). (2) బహిః కే౦ద్రకాలు (Exocentric) ; బహువ్రీహి సమాసం. ఉదా. విప్పర్ల