Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 185

వర్జాల వ్యాప్తిలో కూడా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా పదా౦తంలో దీర్ఘ౦ కనిపించటాన్ని చెప్పవచ్చు. ఉదా. తనఖా (SII 10.759, 16,1664).

6.17. ఆంగ్లభాషా మూలకాలు : 1802 నుంచీ ఆగొష్టు (NI 2 కందుకూరు 42 1,1802), కలకటరు (NI 2 కందుకూరు 42 8.1802), లేటు (SII 6.1192.6, 1866) మొదలైన ఇంగ్లీషు పదాలు శాసనభాషలో కనిపిస్తున్నా తెలుగు వర్ణమాలపైన ఇంగ్లీషు ప్రభావాన్ని గురించి చెప్పటానికి కావలసినంత పదజాలం శాసనాల్లో కనిపించటంలేదు.

6.18. సంధి : సంది విషయంలో పూర్వ యుగాలకు, ప్రస్తుత యుగానికి భేదం లేని వాటిని వదిలేస్తే కింది విశేషాలను పేర్కొనవచ్చు.

తద్ధర్మ విశేషణ ప్రత్యయమైన - ఏ పైన అట్టు, అందుకు పదాలలోని మొదటి అచ్చు అకారం లోపించటం గాని, టకారం ఆగమంగా రావటంగానీ 16వ శతాబ్ది నుంచీ విరివిగా కనిపిన్తుంది. అంతకు ముందు ఇట్లాంటిచోట్ల యడాగమం మాత్రమే కనిపించేది. ఉదా. పెట్టేట్టలుగా. (NI 2 నెల్లూరు 1.23-24, 1638), నడచే టట్టుగా (SII 10.763.12, 1670), వేంచేసే టందుకు (SII 5.874.10.1620). పై రెండు రకాల రూపాలు ఆధునిక కాలంలో పూర్తిగా ప్రచారంలో ఉన్నాయి. పై రూపాల్లోని ట చారిత్రకంగా - ఏటి (<ఏ + అట్టి) కి సంబంధించిందై ఉంటు౦ది

ఇది కాక ఆధునిక భాషలో కనిపించే అనేకమైన సంధులు ఈయుగ ప్రారంభం నుంచే వ్యాప్తిలో కనిపిస్తాయి.

రెండు హల్లులకు మధ్య అజ్లోపం, అంటే మొదటి పదం చివరి అచ్చు రెండవ పదం మొదటి హల్లుకు ముందు లోపించటం 15వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది. ఉదా. కోమట్రెడ్డి (-కోమటి + రెడ్డి) (SII 10.576.4,1410), కొండ్రాజు (-కొండ + రాజు) (SII 4.709. 132,1558), లోంతట్టు (-లోని + తట్టు) (NI 2 కందుకూరు 48.29,1650-51). అచ్చు లోపించిన తరువాత పరహల్లు శ్వాసం అయితే పూర్వ హల్లుకూడ శ్వాసం కావటం 17వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. ఉదా. అడుక్కొని (-అడుగు +కొని). (NI 2 కందుకూరు 41.36,1683-84).