184 తెలుగు భాషా చరిత్ర
వర్ణంగా గ్రహించటానికి గాని ఆధారాలు శాసనాల్లో లేవు. అనుస్వారం దేశ్య పదాలలోలాగే వర్గాను నాసికానికి చిహ్నం. సంయుక్త హల్లులలో మాత్రమే కనిపించే ఙ, ఞ ల ప్రత్యేక వర్ణత కూడా పరిమితం మాత్రమే. 'మ' వర్ణానికి స, హ లకు ముందు అనునాసిక వకారోచ్చారణ ఉంది (§ 6.8 (i) (1)). పునః ప్రతిష్ట (SII 6.227. 14,1636) లాంటి సమాసాల్లో మాత్రమే కనిపించే విసర్గలను హకారానికి శ్వాస సవర్జంగా గ్రహించవచ్చు.
థకారానికి బదులుగా ధకారం రాయటం, ధకారానికి థకారం రాసే విలోమ లేఖనం (§ 6.9. (b) ) - వీటినిబట్టి చదువుకున్న వారిలో కూడా థ, ధల భేదం పోయిందని చెప్పవచ్చు.చదువుకోని వారి భాషలో మహాప్రాణాలు అల్ప ప్రాణాలు కావటం తెలుగుభాషా చరిత్రలో మొదటినుంచీ ఉన్నదే (రాధాకృష్ణ § 1.85;కందప్పచెట్టి § 1.105). అల్ప ప్రాణాలకు బదులుగా మహా ప్రాణులు కనిపించే కృతక ప్రామాణిక రూపాలు ఈ యుగంలో విరివిగా కనిపిస్తాయి (§ 6.10 (a) ). హింద్వార్య భాషాపదాలవల్ల పదాదిలోను, పద మధ్యంలోను అనేక రకాల సంయుక్త వర్ణాలు తెలుగులో చేరాయి.
6.16. పర్సో - అరబిక్ మూలకాలు: మహమ్మదీయుల పరిపాలన కారణంగా తెలుగులో ప్రవేశించిన పర్షియన్, అరబిక్ పదాలలో f, x, q , y, z వర్ణాలున్నా అవి ఈ నాటీ తెలుగులో ప్రత్యేక వర్ణాలుగా గుర్తించటానికి స్పష్టమైన ఆధారాలు లేవు. f వర్ణమైనా ఆధునిక కాలంలో ఇంగ్లీషు పదాలు తెలుగులో ప్రవేశించిన తర్వాత మాత్రమే ప్రత్యేక వర్ణం అయింది (కృష్ణమూర్తి 1959:85). అయితే ఈ భాషలను బాగా చదువుకున్న వాళ్ళు పైవాటిల్లో కొన్ని ద్వనులనైనా వేరుగా ఉచ్చరించే వారని లేఖన భేదాలవల్ల చెప్పవచ్చు. కొన్ని వర్ణాలు అంతకు ముందే హింద్వార్య పదాల ద్వారా తెలుగులో ప్రవేశించిన వర్ణాలతో నమ్మిశితం అయి ఉంటాయి. పై వర్దాలు వాటి ఉచ్చారణకు దగ్గరగా ఉండే వర్జాల లిపి సంకేతాలతో గుర్తి౦చటం జరిగింది. f వర్ణాన్ని ఫ తోను ప తోను గుర్తించారు (§ 6.8 (vii) ). ఇక్కడ ఫ అసలైన ఉచ్చారణను సూచిస్తూ ఉండవచ్చు. x, q లను ఖ, క లతో గుర్తించారు. ఉదా. ఖరారు (NI 2 కందుకూరు 80.28,1642), మొకాసా (SII 10.758. 14,1664) y ను గ తోను, z ను జ తోను గుర్తించారు. ఉదా. గులాపు వానికి (NI 3 ఒంగోలు 5.17,1636), జాగీరు (SII 7.790.1,1774). పర్సో _ అరబిక్ పదాలవల్ల తెలుగు