పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకరణం. 6

శాసనభాషా పరిణామం (క్రీ.శ. 1600 - 1899)

- కె. కె. రంగనాధాచార్యులు

6.0. తెలుగు భాషా పరిణామాన్ని తెలుసుకోవడానికి లభించే ఆధారాలలో శాసనాలు ప్రధానమైనవి. అయితే శాసనాలు సమకాలీన భాషను సమగ్రంగా ప్రతిబింబిస్తాయని చెప్పటానికి వీలులేదు. గ్రా౦థిక లేక ప్రాచీన, వ్యావహారిక భాషారూపాలు సమ్మిశ్రితమై శాసనాల్లో కనిపిస్తాయి. అంతేకాదు శాసనాల్లో ఉపయోగించిన భాష పరిమిత ప్రయోజనం, పరిమిత స్వరూపం కలిగిఉంటుంది. రాజవంశక్రమాలు, దేవాలయాలకు,బ్రాహ్మణులకు రాజులు చేసిన దానవివరాలు,రాజుల విజయయాత్రలు, రాజులు, రాజుల ప్రతినిధులు, వివిధ సమస్యలు విషయంలో ఇచ్చిన తీర్పులు-ఇట్లా కొన్నిరకాలైన సమాచారాలను అందించటానికి శాసనాలను ఉపయోగించేవారు. మొత్తం మీద శాసనభాష రాజకీయ వ్యవవారాల్లో ఉపయోగించే ఒక ప్రత్యేక శైలికి చెందిందిగా పేర్కొనవచ్చు. ఇటీవల కాలం పరకు పెద్దలు రాసే ఉత్తరాల్లోను, రాతకోతల్లోను ఇలాంటి భాషను మనం చూడవచ్చు. కాకపోతే శాసనాల్లో వ్యావహారిక భాషారూపొలు ఎక్కువగా ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి తెలగుభాషా పరిణామాన్ని తెలుసుకోవడానికి అవి ప్రధానాధారాలవుతున్నాయి.

ప్రస్తుత యగంలో శాసనాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రకరణ రచనకు పరిశీలించగలగినవి రెండు వందల ముద్రిత శాసనాలుమాత్రమే ఈ యుగంలో ముఖ్యవిశేషం కుతుబ్ షాహీల పరిషాలనలో ఆంధ్రదేశం ఉండటం. వారికీ, వారి ప్రతినిధులకూ సంబంధించిన శాసనాలు ఎక్కువగా ఉన్నాయి. మొఘల్ వంశీయుల ప్రతినిధుల శాసనాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ కాలపు శాసనభాషలో దక్ఖనీ ఉర్జూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అనేకమైన కొత్త ఆదాన పదాలు భాషలో కనిపిస్తాయి. 1802 నుంచి ఆంగ్ల భాషా పదాలు