Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

174 తెలుగు భాషా చరిత్ర

కూడా శాసనాలలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ కాలపు శాసన భాషకు చారిత్రక ప్రాధాన్యం ఉండటమే కాకుండా, తెలుగు భాష తన ఆధునిక స్వరూపాన్ని సంతరించుకోవటం ఈ యుగ౦లోనే ప్రార౦భమవుతుంది.

లేఖన పద్ధతులు ఉచ్చారణ

6.1. ఈ కాలంలోని భాషా స్వరూపాన్ని గురించి చెప్పుకొనేముందు శాసనాల్లో గల లేఖన స౦ప్రదాయాలను గురించి, వాటికి, ఉచ్చారణకు గల సంబంధాన్ని గురించి కొన్ని విశేషాలు చెప్పుకోవలసి ఉంటుండి. ఉచ్చారణతో సంబంధంలేని లేఖ్యాక్షర సంకోచం ((orthographic abbreviation) ఈ కాలపు శాసనాల్లో ఎక్కువగా కనివిస్తుంది. ఉదా. గన్కు (గనుక) (NI 2 కందుకూరు 48.52, 1650), అయ్న (అయిన) (NI 3 ఒంగోలు102.11,1762), యిచ్న (ఇచ్చిన) (SII 5.1221.9,1809)

6.2. రేఫమీద హల్లుని ద్విరుక్తంగా రాయటం రేఫకు బదులుగా వలపల గిలక రాయటం 16, 17 శతాబ్దుల్లో ఎక్కువగానే కనిపిస్తున్నా 18, 19 శతాబ్దులకి పూర్తిగా తగ్గిపోయింధనే చెప్పవచ్చు. ఉదా : రాజమాత్తా౯ండ (SII 7,845,2,1682), యెల౯గడ్డ (SII 6.79.3,1796)

6.3. మూర్ధన్య హల్లుమీద దంత మూలియాలను రాసినా వాటి ఉచ్చారణ మాత్రం మూర్ధన్యమే అయిఉంటుంది. ఉదా: పట్నంబు (NI 2 నెల్లూరు 83. 63-64, 1645).

6.4. ద్విలిపి ప్రయోగం (Use of digraph): తాలవ్యచకారోచ్చారణను, శకారోచ్చారణను సూచించటానికి చ, స లకు 'య' కార సంకేతాన్ని చేర్చటం క్వాచిత్కంగా కనిపిస్తుంది. ఉదా: ఆచ్యంద్రార్కస్థాయిగా (SII 10,771.14,1692), స్యూద్రులు (SII 10.771.15, 1692).

6.5. 9/10 శతాబ్దులనుంచి కనిపించే పూర్ణానుస్వారాన్ని సూచించటానికి అనుస్వార చిహ్నంపైన హల్లులను ద్విరుక్తంగా రాసే అలవాటు (§ 8.28), కొన్ని అపవాదాలున్నా, 17, 18 శతాబ్దులలో ఎక్కువగానే కనిపిస్తుంది. అర్ధానుస్వారానికి ప్రత్యేక చిహ్నం శాసనాలలో కనిపించదు. పూర్ణానుస్వార చిహ్నాన్నే దానికీ వాడేవారు. అయితే దానిపైన హల్లును ద్విరుక్తంగా రాయకపోతే దాన్ని