శాసన భాషా పరిణామం 171
గుర్తించవచ్చు. ఈ క్షేత్రం అపహరించినవారు పంచ మహాపాతకాలున్ను చేసిన వారు (SII 6.242.24,1447), ఇందు అపహరించినవారు కర్తృస్థానంలోను, చేసిన వారు విధేయవిశేషణ స్థానంలోనూ ఉన్నాయి.
మాకినటి...కోహలి సమర్పించినాడు (SII 5.1229.7-8,1495), ఇందు సమర్పించినాడు రూపం కేవలం సమాపకక్రియగానే ప్రయోగింపబిడ్డది. కర్త ఏకవచన౦లో ఉన్నా గౌరవార్థం క్రియ బహుత్వంలో ప్రయోగించడం ఈయుగపు శాసనాల్లో క్వాచిత్కంగా కనిపిస్తుంది. ఇకై౦కర్యం శృంగారరాయండు ఆచంద్రార్కముగాను అవదరించువారు (SII 5.102.12,1442). యికై౦కర్యం శ్రింగార రాయండు ఆ చ౦ద్రార్కముగాను అవధరి౦చువారు (పై.5.108.16-19,1408). పై వాక్యాల్లో శృ౦గారరాయండు ఒక దేవతపేరు. కర్త ఏకవచనంలో ఉంది. అవధరించువారు అనే క్రియ గౌరవార్థంగా బహుత్వంలో వాడబడి ఉంది.
సంశ్లిష్ట వాక్యం
5.64. సామాన్యవాక్యం ప్రధానంగా ఉండి అది ఆధారంగా ఒకటన్నా ఉపవాక్యం ఉంటే అట్టిదాన్ని సంశ్లిష్టవాక్య౦ అనవచ్చు. యీ ధర్మానకు యవ్వరు తప్పినాను, గంగలోను గోవు బ్రాహ్మణవధ చేసిన పాపానం బోఉవారు (SII 4.981.5.1518). ఇందు "యీ ధర్మానకు యవ్వరు తప్పినాను” ఉపవాక్యం, మిగిలింది ప్రధానవాక్యం..
పై వాఖ్యాన్ని యత్తదర్థక వాక్యం అనవచ్చు. ఈ యత్తదర్దక వాక్యాల్లో సాధారణంగా ఎవరు..వారు.. అని ఉంటుంది. కాని యీ యుగపు శాసనాల్లో ఎవరు అని ప్రశ్నార్థకశబ్దం కనిపిస్తుంది. కాని వారు అని తదర్ధకశబ్దం లేకే వాక్యం ముగింపబడుతుంది. ఎవ్వరేనేమి ప్రతిపాలించక విఋద్ధంగా నాడిరా గోహత్యా బ్రహ్మహత్యాదిపాతకాలు చేసిన పాపాలం బొంది ఆరవయివేలే౦డ్లు మహారౌరవాది నరకాలం గూలువారు (SII 5.87, 1494), ఘడియారం బ్రాహ్మల గోత్రాలకు వ్రిత్తిపన్ను పరచుం ఎవ్వరు గొనం దలచిన బ్రాహ్మనిం జంపిన దోషానం బోవారు (పై.5.10,1404), ఎవ్వరు విరోధించినా మహాపాతకాల పడువారు (పై. 5.29,1402). ఎవ్వరు శబ్దం బహువచనరూపంగాను, ప్రధానవాక్యంలోని క్రియ ఏకవచనంలోనూ ఉండే వాక్యం ఈ యుగపుశాసనాల్లో ఒక్కచోట కనిపిస్తుంది. ఎవ్వరు అపవారించినా దోషాన పోవువాCడు (SII 5.204.15, 1423).