Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

170 తెలుగు భాషా చరిత్ర

5.63. విశేషణనమాపకవాక్యం: ఇందులో సమాపకక్రియకు బదులు విధేయ విశేషణం ఉంటుంది. ఉదా: ఇయ్యవనరం ఆచ౦ద్రార్కస్థాయి. (SII. 5.5.14,1404). ఇందు ఇయ్యవసరం కర్త. దీనికి అచంద్రార్కస్థాయి విధేయవిశేషణమవుతుంది. ఇలాంటి వాక్యాల్లోనూ ద్వితీయాదివిభక్తి ప్రత్యయాల తోడి నామపదాలు సంధర్భానుసారం రావచ్చు. కర్తలోపించవచ్చు. ధర్మం పాలించి వారికి దాసిదాసిని (SII 4.772.19,1437). ఈ వాక్యంలో దాసిదాసిని అనేది విధేయ విశేషణ౦, కర్తయైన నేను పదం ఇందు లోపించింది.

విధేయవిశేషణస్థానంలో సంశ్లిష్టసమాపకక్రియకూడ రావచ్చు. అబ్బన ఆ చ౦ద్రార్కమును గుగ్గిలము జరపంగలవాడు (SII.5. 129.7, 1422). చారిత్రకంగా ఇట్టి సంశ్లిష్టసమాపక రూపాలు మొదట విధేయవిశేషణంగా ఉండినట్టు చెప్పవచ్చు. తర్వాత ఇది సామాన్యసమాసక క్రియలాగానే ప్రయోగంలోకి వచ్చినట్టు తెలు స్తుంది. ఈ రూపం ఎప్పటిదాకా విధేయవిశేషణంగా ఉండి ఎప్పటినుండి సమాపకక్రియగా మారింది అని చెప్పడం చాలా కష్టం, కాని శాసన ప్రయోగాల్ని ఈ కిందివి గమనించవచ్చు.

సాధారణ౦గా శాసనభాషలో భూతకాలవిషయాల్ని చెప్పవలసి వచ్చినపుడు సామాన్యసమాపకక్రియనూ, భవిషద్విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు సంశ్లిష్టసమాపక క్రియనూ వాడటం తరుచుగా కనిపిస్తుంది. వర్తమానవిషయం శాసనాల్లో అట్టే కనిపేంచదు. ఊదా: పొందూరి నాగరాజు. .. క్రయముగొని పెట్టెను. ఆక్షేత్రము అనుభవించి వారణాశి మారనంగారి కొఢుకు అబ్బన ఆ చంద్రార్కమును గుగ్గిలము జరపంగలవాడు (SII 5.129. 1422). ఇట్టి పద్ధతి పూర్వయుగంలోనూ ప్రచారంలో ఉన్నట్టు గమనింపవచ్చు. ఇలా భవిష్యత్ కాల సూచక సంశ్లిష్టసమాషకక్రియలు స్తామాన్యసమాపక క్రియలలాగానే వర్తిస్తాయి. కాని భూతకాల సంశ్లిష్టసమాపకక్రియారూపాలు శాసనాల్లో తరుచుగా విధేయవిశేషణాల్లాగా వర్తిస్తాయి. క్వాచిత్యంగా సమాపకక్రియల్లాగ వర్తిస్తాయి.

యీ ధర్మము యిట్ట పాలింపక ముందటికి యెవ్వరు దప్పినాను పంచమహాపాతకాలుంన్ను చేసిన పాపానం బోఇవారు.(SII 10. 586.21,1448), ఇందు పోఇనాఋ అను భూతకాల సంశ్లిష్టసమాపక రూపం విధేయవిశేషణంగా వాడినట్లు