పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

166 తెలుగుభాషాచరిత్ర

5.52. క్రియాప్రాతీపదికకు ఆత్మార్థకబోధకంగా -కొను చేరడం సాహిత్య భాషలో చూస్తున్నాం. ఇట్టిచోట్ల -క చేరడం నేటి వ్యావహారికభాషలో సహజం. ఇట్టి -క చేరిన రూపాలు ఈ యుగపుభాషలో క్వాచిత్కంగా కనిపిస్తాయి. ఆచంద్రార్కము చేసుక (SII 5.80.16,1410). చేసుక (NI 3. పొదిలి 34.18, 1588). చేయు, పోయు మొదలగు యకారాంత ప్రాతిపదికలకు చేసికొను, పోసికను మొదలగు రూపాలే సారస్వతభాషలో ఉంటాయి. కాని ఈ యుగపు శాసనాల్లో చేసుకొని (SII 4.709. 84, 1558) వంటి రూపాలు క్వాచిత్కంగా కనిపిస్తాయి.

5.53. శత్రర్దక రూపొలు : శత్రర్థకరూపాలకు -చున్ ప్రత్యయం చేరడ౦ తెలుగుభాషలో పూర్వయుగం దాకా కనిపించింది. ఈ -చున్ ఈ యుగంలోనూ క్వాచిత్కంగా కనిపిస్తుంది. చేయచుం (SII 10,737.41,1520). కాని -తు లేక -తున్ను ఈ యుగంలో ప్రచురంగా కనిపిస్తుంది. పృథ్వి రాజ్యం చేస్తుండి (SII 4.800,11.1513), మళివస్తున్ను (పై. 6.1310.11,1599), రాజ్యంపాలిస్తున్ను (పై 10.751.17.1592), విచ్చేస్తున్ను (తి.తి. దే.శా.3.68.1, 1514), మొ.వి.

విశేషణాలు

5.54. త్రికంలో ఒకటియైన'ఆ' రూపం దానియొక్క, దానికి సంబంధించిన, ఆతనియొక్క, ఆతనికి సంబంధించిన మొదలైన అర్థాలలో కూడా వాడబడుతుంది. మిఱుత వెలుగడంవండను ఖ 1న 10ను ఆ పేరటిపట్టు (SII.5. 145. 16, 1419). కంచుల బళ్యమున్ను ఆ కుడుకాను (పై 5.47.17, 1424), ఆ మీంది నిలువు మంటపమున్న (పై. 5.86.25,1422) , అల్లాడ రెడ్డిగార్కిని అ కుమారులు కుమారయ్యం గార్కిని (పై. 5.104.5,1428). వీరభద్రయ్యంగారున్ను ఆదేవులు అనతల్లెంమంగారున్ను (పై. 5.108.7, 1528), చిత్రపు భీమన్నాను ఆ మల్లన్నాను (పై. 5.47.7,1424) మొ.వి. ఇట్టివి వూర్వయగంలో కూడా క్వాచి త్కంగా కనిపిస్తాయి.

5.55. -ము వర్ణానికి -వు-, -ంపులు రావడం పూర్వయుగం చివరిదశలోనే విరివిగా జరిగింది. ఈ యగంలోనూ దీని వాడుక విరివిగా కనిపిస్తుంది. ఉత్తరపు దిక్క: (SII. 5.789.226,1518), మధ్యాహ్నపు అవసరానను ( పై. 5.118. 11, 1488), నారికేళపుంగాయలు (పై. 4.702.138, 1438) మొ.వి.