పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 167

5.56. ఉదంతస్త్రిసమంపైన ద్రుత్వం రావడం పూర్వయుగంలో లాగానే జరుగుతుంది. క౦చుం బళ్యము (SII 5.47.17,1424), కంచుంబ్రతిమ (పై. 5.1185,8 1460), కంచుంబుత్తడి (పై. 5.1175.14,1419). వీటి సామ్యంచేత ఊరుంగాయెలు (పై. 4.981.7, 1518) వంటి రూపాల్లోనూ అనుస్వారం కనిపిస్తుంది.

5.57. వైభాజిక ప్రత్యయం : పూర్వయుగంలో -చేసి, -ఏసి రూపాలు రెండు కనిపించాయి. కాని చివరిదశలో -ఏసి మాత్రం కనిపించింది. ఈ యుగంలో -ఏశి మాత్రం కనిపిస్తుంది. పుట్టె౦డేశి (SII 5.26.7, 1412). మొ.వి. సి > శి మార్చు చాలా ప్రబలంగా ఉండటంచేత -ఏశి అని సాధారణంగా కనిఫిన్తుంది.

5.58: పరిమాణార్థంలో 1. -ఎండు/-ఎడు. 2. -అండు/-అడు చేరినట్లు పూర్వయుగంలో చూశాం. అందు రెండోది వికాఖ- శ్రీకాకుళం ప్రాంతంలోనే ప్రచార౦లో ఉండేది. మొదటిది మిగతా ఆంద్రదేశంలో బహుళ ప్రచారంలో ఉండి రానురాను విశాఖ-శ్రీకొకుళం ప్రాంతానికి పాకుతూ ఉండేది. ఈ యుగంలో ఈ రెండురకాలైన ప్రత్యయాలూ విశాఖ-శ్రీశాకుళం ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి. పుట్టెడు ఈ క్షేత్ర (SII 6.868.44 1487), అడ్డడు (పై. 8.1070.9.1420), రెండూ విశాఖ జిల్లాలోనివే. ఔపవిభక్తికరూపాలతోడి సామ్యం వల్ల -డుకు బదులు -టి కొన్నికొన్ని చోట్ల కనిపిస్తుంది. అడ్యంటి లెక్కను ( SII 5.1180.10,1402), తూమింటి సమస్య (NI 2. కందుకూరు 88.15, 1526). మొ వి.

5.59. సంఖ్యకు పూరణార్థకంలో పూర్వయుగంలో -అగున్, -అవున్, -అవన్ మాత్రం ఎక్కువ ప్రచారంలో ఊన్నట్లు చూశా౦. -ఓ ఒక్కటి మాత్రం కనిపించింది. కాని ఈ యుగంలో ఓ కూడా చాలా ప్రచారంలోకి వచ్చింది. నాల్గో భాగమున్ను (SII 4.669.86,1546), రెండోమేళం. (పై. 6.702.149,1548) మొ.వి.

క్రియావిశేషణాలు :

5.60. భూతకాల క్రియావిశేషణాల్లోమా, భవిష్యత్క్రియావిశేషణాల్లోనూ పూర్వయుగానికి ఈ యుగానికి తేడా ఏమీలేదు. వర్తమాన క్రియావిశేవణాల్లో శాసనాల్లో అరుదుగా ఉంటాయి. కాని తద్ధర్మార్థక క్రియావిశేషనాల్లో పూర్వ యుగంలో