పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 165

పై సంశ్లిష్టరూపొల్లో 5.47 ఇ (2) తప్ప మిగిలినవన్నీ క్రియావిశేషణాల పైన సర్వనామాలుచేరగా ఏర్చడినవే కాబట్టి అవి కర్తృస్థానంలోనూ క్రియాస్థానం లోనూ వస్తాయి. ఈ క్షేత్రం అపహరి౦చినవారు పంచమహాపాతకాలున్ను చేసిన వారు (SII 6.242.24. 1427) మొ.వి.

5.50. కాలబోధకాలు కానటువంటి సమాపకక్రియలైన వ్యతిరేకార్థకక్రియలు, విధ్యర్థకక్రియలు మున్నగువాటి విషయంలో విశేషాలేమీ లేవు. కాని సంశ్లిష్ట విధ్య ర్థక క్రియారూపాల విషయంలో కొన్ని విశేషాలున్నాయి. ఈ సంశ్లిష్ట విధ్యర్థక క్రియలు తద్ధర్మక్రియావిశేషణాలకు -అదిచేరగా ఏర్పడుతాయి. తద్ధర్మార్థక క్రియా విశేషణాలు, నాల్గు రకాలు. కాబట్టి నాలుగురకాల క్రియావిశేషణాలపై -అది చేర్చగా విధ్యర్థక క్రియారూపా లేర్పడుతాయి: వాటిలో (1) పోయినది (SII 10.87.97.97) నడుపునది (పై. 4.1104.6).(2)కొనెడిది (పై. 10.421.94), పొందిడిది (పై 5.194. 14). పొందేఢి > పొందిడి వంటిమార్చు గతయుగంలోనే క్వాచిత్కంగా కనివిస్తుంది, (3) రక్షించేది (NI 2.28 A. 15), ఎత్తేది (SII 10.334.90) వంటి రూపాలు పూర్వయుగంలో బహుళ ప్రచారంలో ఉండేవి. ఈ యుగంలో అవధరించిది (SII 4.981.5.1518), శావసేనిది. (పై. 10,747.17,1574) వంటి రూపాలు తరచుగా కనిపిస్తున్నాయి. ఇట్టి రూపం పూర్వయుగంలో ఒక్క చోట మాత్రం కనిపిస్తుంది. పెట్టేది (SII. 10.884, 92). ఇదిగాక ఈ యుగంలో అవధరించేది. (తె.శా.1.156.14) రూపాలు కూడా క్వాచిత్కంగా కనిపిస్తాయి.

'అసమాపక క్రియలు

5.51. చేదర్ధక క్రియలు : చేదర్థకరూపాలు పూర్వయుగంలో ప్రాతిపదికకు -ఇనన్, -ఇనాన్ చేరగా అయ్యేవి. -వచ్చు -వచ్చినన్, _వచ్చినాను. -ఇతేను లేక -తేను కూడా గతయుగంలో క్వాచిత్కంగా కనిపించాయి. కాని ఈయుగంలో -ఇ తేను, -తేను రూపాలే చాలా ప్రబలంగా కనిపిస్తాయి. వేస్తేను (SII 5.26,3, 1412), కొటితే (పై. 5. 1812.9,1599), అంపితేను (పై. 10.751.10,1592), దయచేస్తేను (పై. 10.751.22. 1592), భిలమైపోతేను.(ఫై.10. 739.7,1583), విన్నపంచేస్తేను (పై. 10.745.25,1580), -ఇనాన్ చేరినవి కూడా కనిపిస్తాయి. తప్పినాను (SII 4.981.5,1518), విఘ్నము చేశినాను (పై. 10.785.17, 1521) మొ.వి.