పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

160 తెలుగు భాషా చరిత్ర

పోవడం చూశా౦. ఈ యుగంలో ఈ మార్పుతో ఉన్న రూపం ఒక్కచోట మాత్రం కనిపిస్తుంది. ఇరువదేను మోదాలు (SII 6.663. 11,1132) సింహాచలం-విశాఖ.

5.39. నూఱు శబ్దానికి అంతకంటె చిన్న సంఖ్యను చేర్చునపుడు 'ఱు' కు ఐదులు 'లు' కావడం తెలుగుభాషలో సహజం. కాని ఈ యుగంలో 'లు'కు బదులు -ంట సర్వత కనిపిస్తుంది. నూంట యెనుమండ్రకు (SII 6.248.42,1515), నూంటపది (పై. 6.743.6,1428), వేయి మున్నూంట ఇరవై యేడు (పై. 10. 573.36,1405), నూ౦ట యెనంభది (పై. 6.805.27,1472), మూన్నూ౦ట ముష్పదియేడు (పై. 10 582.1,1415), నూంట ఇబ్బరకున్ను (పై. 10.737, 60,1526) మొ.వి. ఇట్టివి గతయుగంలోనూ క్వాచిత్కంగా కనిపిస్తాయి. కాని 12-14వ శతాబ్దులో -ట తోటి రూపాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి.

5.40. ఇద్దుము (SII 5.1153,10,1471), ముత్తుము (NI 2కనిగిరి 4.36, 1416), నలుతుము (పై. 3.68. 13-24,1534), ఎందుము (పై. 2కనిగిరి 4.37 1416). లేక ఎందుము (SII 5.1162.14, 1427) వంటి రూపాల్లో గత యుగానికి ఈ యుగానికి తేడా ఏమీలేదు. ఏడుతూములు అనుటకు ఏడుదుమం' గుంచ్చండు (ఫై. 6.1098. 15,1402), ఎద్దుము (పై. 6.1091,8.1421) వంటి రూపాలు కనిపిస్తాయి. ఎనిమిది అనడానికి ఎనమందుము (NI 2కనిగిరి 4.33) కనిపిస్తుంది.

సర్వనామాలు

5.41. ఉత్తమ మధ్యమపురుష సర్వనామాల్లో స్వరంతో ప్రారంభమయ్యే సర్వనామరూపాలీయుగంలో కనిపించటం లేదు. అంతా అనునాసీకాలతోనే ప్రారంభమౌతాయి. ఉదా: మేము (SII. 6.122.17,1551), మీరు (పై.4.1875. 22, 1444) మొ.వి. తాము అనడానికి పూర్వయుగంలో తారు అనే రూపమే ఉన్నట్లు గుర్తించాం. ఈ యుగంలో తాము, తారు అను రెండు రూపాలూ కని పిస్తాయి. ఉదా: తారు పాలింపి దేశాలంగల (పై. 6.1168.32,1484), తమ లోందాము (ఫై. 10.748.4, 1577) మొ.వి. వాండు, వీండు అను సర్వనామాలకు పూర్వయుగంలో వారు, వీరు అనురూపాలే బహుత్వంలో కనిపిస్తాయి. కాని ఈ