శాసనభాషా పరిణామం 159
5.34. నాలుగు : నాలుగు శబ్దానికి నాలు అనే రూపం కూడా విశాఖ- శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నట్లు గతయుగంలో చూశాం. ఈ యుగంలోను అట్టి రూపం ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. నాలుకుంచాలు (SII 6.1057.9, 1514) సింహాచలం : నాలుపుట్లు (పై.6.1040.9, 1417) సింహాచలం : విశ్యలు నలు (పై. 5.1239.12, 1418) శ్రీకూర్మం.
5.35. ఐదు : ఐదు శబ్దానికి పూర్వయుగంలో ఐదు, ఏను అనే రెండు రూపాలూ వ్యాప్తిలో ఉండి రానురాను ఐదు శబ్దం ప్రచారానికి వచ్చి ఏను శబ్ద౦ తగ్గుతూ వస్తున్నట్లు చూశాం. ఈ యుగంలో ఐదు శబ్దం అన్ని ప్రా౦తాల్లో స్థిరంగా నిల్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏను శబ్దం విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలో మాత్రం క్వాచిత్కంగా కనిపిస్తుంది. ఇరువఇ ఏనుపుట్లు (SII 5.1199.5, 1451) శ్రీకూర్మం ; ఇరవై యేనుట (పై. 6.844.16, 1472) సింహాచలం.
5.36. పదికి ఒకటి,మూడు,నాలుగు, ఎనిమిది చేరేటప్పుడు గతయుగంలో -ఉన్ - ప్రత్యయంగాని లేదా కేవలం -న్ - గాని చేరినట్లుు చూశాం. -న్- ప్రత్యయం ద్రుతంవలె ఉంటే ఉంటుంది, లేకపోతే కనిపించదు. ఉదా: -ఉన్- తోడివి పదునెనిమిది, మొ.వి. -న్- తోడివి - పదినెనిమిది, పదియెనిమిది మొ.వి. ఈ యగంలో -ఉన్న - ప్రత్యయం స్థిరపడినట్లు చెప్పవచ్చు. అనగా -న్ -మాత్రం చేరడం ఈ యుగంలో లేదు. పదునాలుగు (SII 6,219.12 1494) మొ.వి. పదునొకండు శబ్దానికి పదునకొండు అని 13వ శతాబ్దిలో ఒక ప్రయోగం కనిపిస్తుంది. పదునకౌండు (తె.శా. 141.8, 1231). ఈ యుగంలో ఒక్కచోట ఇలాంటిది కనిపిస్తుంది. పదున[కొ]౦డు (SII 4.1375.18, 1444) ఇందులో ఉకారం అకారం కావడం విశేషం.
5.37. ఇరువది, ముప్పది మొదలగు సంఖ్యావాచకాల్లో చివర ది > యి మార్పు గతయుగంలోనే వేగంగా జరుగుతూ ఉండింది. ఈ యుగంలో ఈ మార్పు పూర్తిఅయి స్టిరపడినట్టు తెలుస్తుంది. అయినా -ది అంతంతో కొన్ని రూపాలు ఈ యుగంలోనూ కనిపిస్తున్నాయి. ఏ౦బది (SII 6.865.7, 1403), మూన్నూట ముప్పది యేడు (పై. 10.582.1, 1415) మొ.వి.
5.38. ఇరువది, ముప్పది శబ్దాలకు ఏను శబ్దం చేరగా ది > డి గా మారడం పూర్వయుగంలో చూశా౦. పూర్వయుగంలోనే అంతిమదశలో ఈమార్పు తగ్గి