శాసనభాషా పరిమాణం 151
అమృతమణి శబ్దానికి సింహాచలంశాసనాల్లో తరుచుగా హి చేరడం ఈ యుగపు శాసనాల్లో ఒక విశేషం. అమృతమణిహి ( SII 6.827.11,6,778.8, 1427, 1415, 6.966.3, 1421) మొ.వి. హి చేరని రూపం అమృతమణి (పై. 6.1054.8, 1461, 6.727.8, 1465) మొ.వి.
హిందువులు అనే పదం ఒకచోట ఇందులు (తె శా. 1. 56.1,1551) అని ఉండటం మరొక్కవిశేషం.
5.17. పదమధ్యమందలి వకారం మకారం కావడం ఈ యుగపు శాసనాల్లో క్వాచిత్కంగా కనిపిస్తుంది. తిరుమజాము ( < తిరువజాము<తిరువర్థజాము) (SII 6.1085.7,1428), హేమలంబి (పై. 66.08.8.1580), దేమున్కి ( < దేవునికి NI 8 పొదిలి 14.29,1517)
తాలవ్యాచ్చులు పరమవుతుండగా వకారం యకారం కావడం తెలుగులో పూర్వ యుగంలోనే కనిపిస్తుంది. కయిలలు (<కవిలలు) (SII 5.1347.10,1098:5 1348.11,1098). ఈ యుగంలో అట్టివి క్వాచిత్కంగా కనిపిస్తాయి. ఉదా : ఇదీపం బెలుంగును ( < వెలుంగను) ( పై. 6.1024.8,4416), ఇండ్లపొది (< విండ్లపొది) (పై. 6.770.8,1408), గోఇందు నాఇని కొడ్కు ( < గోవిందు) పై.6.1104.18,1420)
5.18. తాలవ్యాచ్చులు పరమైతే సకారం శకారంగా వ్రాయడం 13వ శతాబ్ది నుంచి చాలా తరచుగా కనిపిస్తున్నట్లు ముందే తెలుసుకొన్నాం. ఈ యుగంలోనూ అట్టివి చాలా తరచుగా కనిపిస్తున్నాయి. వల్లభదాశి లేస్తేచేశి (SII. 5.24.9,1401) పుట్టె౦డేశి...పందుమేశి (పై. 5.26.7,1412); చేశెను (పై. 5.37.40,1494). ఈ యుగంలో మరో విశేషం ఏమంటే ఈ స < శ మార్పు జరిగాక దాని పైన ఉండే ఎ ఏలు, అ ఆలుగా మారుతాయి. శలవు దయచేస్తేను (పై. 10.751.22, 1598), శలవు ఇచ్చి (పై. 10.751.21,1598), సమర్పణచేశను (పై.6.1073. 12,1402), శావ సేసిది (పై. 10.747.17, 1574), శావకు (పై. 10.747,19, 1574), దశిమి శావలకు (పై. 10.747.9, 1574) మొ. వి. దీన్ని బట్టి ఈ యుగంలో తాలవ్యహల్లులపై నుండే ఏ ఏలు ఎ ఏలుగా ఉచ్చరించబడేవని స్పష్టపడుతుంది. (చూ. § 5.3). ఇలాంటి ఉచ్చారణ పూర్వయుగంలోనే ప్రారంభమైనట్లు కూడా చూశాం.