పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 తెలుగు భాషా చరిత్ర

5.19. ద్విత్వానునాసికాలముందు ఈ యుగంలో చాలా తరుచుగా అనుస్వారం కనిపిస్తుంది. కాచంన్నందారు ( SII 5.29.8,1402). పుచుకొంన్న గ్రామాలు (పై.6.695.2.1519), దుంన్ని (పై. 10747,10,1574), వొ౦మ్మెచ్చు (తి.తి. దే. శా. 3.38.4, 1512), తిరుమలంమ్మవారు (పై. 9.59,8,1512) మొ.వి. ద్విరుక్తాలు అద్విరుక్తాలు కావడం పూర్వశాననాల్లోనూ ఈ యుగవు శాసనాల్లోనూ తరచుగా సంభవిస్తుంది. ఈ యుగంలో మూర్ధన్యాక్షరాల్లో ద్విరుక్తం అద్విరుక్తం కావడం చాలా తరచుగా కనిపిస్తుంది.

ద్విరుక్త రూపాలు

సోమారెడ్డి (SII 5.10.5.1404), పెరుమాళ్లకు (పై.5.14.8,1408), ఇంత పట్టు (పై 5.5 8,1404), పుట్టెండేశి (పై. 526.7,1412), సంభాళ్ల (పై. 5.1248.11,1471) మొ.వి.

అద్విరుక్త రూపాలు

సోమారెడ్డి (SII 5 5–10,1404), పెరుమాళకు (పై. 5.10.4,1404). ఇంతపటు (పై. 5.26.18,1412), పుటెండున్న (పై. 5.244,1401), సంబాళ (పై. 5.1248.12.1471); పళెమున్న (పై. 5.29.10,1402) మొ. వి. ఇవిగాక చకారంలోనూ ఇట్టి పరిణామం కనిపిస్తుంది. ఇచి (ఇచ్చి) (SII 5.90.15,1403), పుచుకొన్న (పై. 6.695.2,1519) మొ.వి. శ్రీకాకుళం-విశాఖ శాసనాల్లో ద్విరుక్తాలకు బదులు అద్విరుక్తాలు వాడడం మరీ తరుచుగా కనిపిస్తుంది.

2.20. జ్యేష్ఠమాస మనడానికి శ్రేష్ఠమాసమను సామ్యోత్పత్తి రూపం (folk etymology) పూర్వయుగంలోను ఈ యుగంలోను క్వాచిత్కంగా కనిపిస్తుంది. శ్రేష్ఠ (SII 5.109.3,1428) మొ.వి.

5.21. అనుధాతువుకు అకారంతో ప్రారంభమయ్యే ప్రత్యయంచేరగా నా-అని వర్ణవ్యత్యయరూపం ఏర్పడ్డ (అను+అ- > నా-) సాహిత్యభాషలో తరుచుగా కనిపిస్తుంది. అనవుడు > నావుడు, అనన్ > నాన్ ఈ యుగంలో అనుధాతువు విశేణ రూపమైన అనే అనుశబ్దంలోనూ మొదటి ఆకారం లోపించడం కనిపిస్తుంది. తిరు