Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

140. తెలుగు భాషా చరిత్ర

(గ) తద్ధర్మం : తద్ధర్మ క్రియావిశేషణాలకు నాల్గురకాలై న ప్రత్యయాలు చేరతాయి.

(అ) Ø/-న్‌ (ఆ) -ఎడు/-ఎడి (ఇ) -ఏ/-ఎ (ఈ) -ఇ.

(అ) -Ø/-న్‌ : వడ్డించుచట్టువము (SII 4.1248.20, 1122), విశేషణం తర్వాత అచ్చు పరమైతే నకారం రావచ్చు. చేయునవసరము (పై. 10.690. 110, 139). నకారంరాని రూపం ఆరగించు అప్పాలు పై.. 5.1188.3,1276).

(ఆ) -ఎడు/-ఎడి. : ఉండెడు ( SII 4.1295.8, 1106 ), ఒత్తెడి (పై.4.1253.4,1232). ఎడురూపం 12 వ శతాబ్దిలో ఎడిరూపంతో దాదాపు సమానంగా ఉండి రానురాను తగ్గుతూ వస్తుంది. కేతన, పెద్దన వ్యాకరణాల్ని బట్టిచూస్తే ఇది స్పష్టంగా గుర్తించవచ్చు. ఎడి- అనడానికి- ఎటి అనే రూపం 13 వ శతాబ్దినుంచి తరచుగా కనిపిన్తుంది. అనెటి ఊరు (పై. 6.1213.28, 1265).

(ఇ) -ఏ/-ఎ : ఇది 12వ శతాబ్ధిలో ఆడె, ఆయకు ( SII 10.102.8, 1137) ఒక్క రూపమే కనిపిస్తుంది. తర్వాత తరచుగా కనిపిస్తుంది. చెల్లే మాడలు (ఫై. 5.1249.9, 1293) మొ. వి.

(ఈ) -ఇ : నడిపివాండు. (EI 5,17.141, 1213), అనభవించి వారికి (SII 5.1188.82,1250) మొ. వి. ఇట్టి రూపాలు నేటికీ కొన్ని పామర మాండలికాల్లో ఉన్నాయట. (ఘ) భవిష్యత్కాలము : అన్నంత క్రియరూపానికి -కల శబ్దాన్ని చేరిస్తే భవిష్యద్విశేషణ రూపం ఏర్పడుతుంది. ఆరంగింపంగల కుడుములు (SII 4.1099.6, 1186).

4.59. పై విశేషణాలలో భూతభవిష్యత్క్రియా విశేషణాలపై వాణ్డు, వారు అనే సర్వనామాలు చేరేటప్పుడు వకారం లోపించడం తరచుగా కనిపిస్తుంది. వ్రచ్చినారు (SII 10.702-16,1153); నడపంగలాణ్డు (పై.5.1129.12,1178) మొ.వి. ఇలాంటి రూపాలు 12 వ శతాబ్దిలో క్వాచిత్కంగాను రానురాను చాలా విరివిగాను కనిపిస్తాయి. వీటికి -అది -అవి అనే సర్వనామాలు చేరేటప్పుడు