శాసనభాషా పరిణామం
139
రెండు దీపంబులు ( SII 4.667.15,1132 ), మూడు సంధ్యలు (పై. 5.90.10.1177) ) మొ. వి. ఒకటి సంఖ్యకు ఒక్క, ఒక అనే రూపాలు వస్తాయి. ఒక్కపాలు (పై. 4.748.25,1199), ఒక పళ్ళెము (పై. 5.4.5, 1394) మొ. వి. ఇవిగాక వక, ఒకొ, ఒఖ, ఓ రూపాలు క్వాచిత్క౦గా కనిపిస్తాయి. వకవెలి పొలము (తె. శా. 1.95 38,1118) ఒకకోటి (SII 10.177.22,1171), ఒఖకుండ ( పై. 5.1191.14,1349). ఈ ఒఖ శబ్దం 14వ శతాబ్ది శాసనాల్లోనే కనిపిస్తుంది. ఓ విధము(తె.శా. 1.69.25, 1234)(ఇరు, మొ. సంశ్లిష్ట రూపాలకు చూ. 4,48).
(జ) పూరణార్థకం : అగున్ లేక అవున్ చేరి పూరణార్థకాల్నై సంఖ్యావాచక విశేషణాలు కనిపిస్తాయి. మూణ్డవునడపు (SII 4. 1025. 12,1225), పదియేడగునేణ్డు (పై. 6.128.64,1132) మొ. వి. -అవన్ ప్రత్యయము క్వాచిత్కంగా కనిపిస్తుంది. రెండవనడపు (పై. 4.1194.8,1128), హల్లుల ముందు పై నకారం లోపిస్తుంది. మూడవ పాలివారు (పై. 10.73.107, 1115), 'ఓ' ప్రత్యయం ఒక్కచోట కనిపిస్తుంది. మూండోనడపు ( పై. 4.1155.4,1186). పై శబ్దాన్ని అడపు అనిగాని నడపు అనిగాని చెప్పవచ్చు. అడపు అని చెప్తే - ఓన్ ప్రత్యయం అని చెప్పాలి.
4.58. క్రియావిశేషణాలు :
(క) భూతకాలం : -ఇన, -న, -అ. పెట్టిన (SII 5.67.11.1183). కొన్న (పై. 5.1051. 10.1118), పడ్డ (తె.శా. 1.47.16, 1803). ఈ క్రియావిశేషణాల విషయంలో శాసనభాషకు సాహిత్య భాషకు వ్యత్యాసం కనిపించదు.
(ఖ) వర్తమానకాలం : చున్న ప్రత్యయంచేరి వర్తమాన క్రియావిశేషణ రూపాలేర్పడతాయి. కాని ఈ -చున్న ప్రత్యయం శాసనభాషలో అగు ప్రాతిపదికకు మాత్రం చేరుతుంది. తక్కిన ప్రాతిపదికంపై కనిపించదు. ఏలికలగుచున్న (SII 4.704.11,1167) మొ. వి.