Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

141

'అ' లోపించడం కూడా చాలా తరచుగా కనిపిస్తుంది. కొన్నది (SII. 5.131.7, 1296), చెల్లకలది (NI 2.51.21,1198) మొ. వి.

క్రియావిశేణాలపై సర్వనామాలు చేరిన రూపాల్ని కర్తస్థానాల్లోనూ ఉపయోగించవచ్చు. విఘ్నము సేసినారు ... కపాలమునం గుడిచినారు (SII 5,140).

భవిష్యత్కాల క్రియావిశేషణాలపైన పురుషవచన ప్రత్యయాలు చేరితే అవి కేవలం సమాపకక్రియలే అవుతాయి. నడపంగలరు (SII 10.686.7,1183), ఇలాంటివి విశాఖ - శ్రీకాకుళం ప్రాంతంతోనే ఉంటాయి. వీటిని నడపంగలారు వంటి రూపాలతో పోల్చడం కుదరదు.

మాండలికాలు :

4.60. ఈ యుగంతో దాదాపు 2000 రాతిశాసనాలు ఆంధ్రదేశం నలుమూలలా వ్యాపించి ఉండటం చేత మాండలిక సంబంధమైన అనేక విషయాలు మనకు గోచరిస్తాయి. డా. కృష్ణమూర్తి గారు ఇటీవల కనుగొన్న విశాఖ-శ్రీకాకుళం మాండలీకం7 ఈయుగానికి పూర్వమే ఏర్పడిందనడానికి అనేక మాండలిక విషయాలు పైన చెప్పబడీ ఉన్నాయి. అందులో 1. ఱ కారం వ్రాతలో నిల్చి ఉండటం, 2. స్థ సంయాక్తం నిల్చి ఉండటం, 3. చెల్లుపదానికి చల్లు అని వాడటం. 4. నాల్గు అనడానికి నాలు రూపం వాడటం 5. సంఖ్యా వాచకాల్లో పదినొకండు మొ. వాటికి ,-ఉన్‌- ప్రత్యయంగాక అండు ప్రత్యయం రావటం మొ.వి. ఈ మాండలికంలోని కొన్ని విశేషాలు. ఇవిగాక అనేక మాండలిక విషయాలీయుగంలో కనిపిస్తాయి. అందులో ఒకటి మాత్రం కింద వివరించబడ్డది.

నామపదాల్లో- ఇయాంత రూపాలకు 12 వ శతాబ్దిదాకా ఎలాంటి మార్పులేక నిల్చి ఉన్నాయి. కాని 13 వ శతాబ్దిలో వీటికి రెండు రకాలైన మార్పులు కనిపిస్తాయి. విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలో -ఇయ లోని -ఇ- గాని -ఇయ్‌- గాని లోపిస్తుంది. మధ్య ఆంధ్రలో -ఇయకు మారుగా -ఎ వస్తుంది.

విశాఖ - శ్రీకాకుళం-/-అ ; నూన్య ( SII 8.807.8,1385 ), చెల్యలు (పై. 6.841.6,1364), నూన (పై. 6.864,10,1376) మొ వి.

మధ్యాంధ్రం -ఎ : నూనె (SII 10,334.88,1251), చెల్లెలు(పై. 4.933. 9,1241). మొ. వి. ఈ ప్రా౦తంలో పైన పేర్కొన్న రూపాలు కనిపించవు.