Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 137.

బహుత్వ౦లో -౦డు/-డి వస్తాయి. విధ్యర్థక ప్రత్యయం -ఉ-; ' జరిగించము (SII 5.1202.6,1214), ఉండుండు (తె. శా. 1.78.8,1276), . విచ్చేయుడి (పై. 1.69.15,1234).

(ఇ)అశీశ్శాపాదులు : అయ్యుండును (SII 6.781.14,1386 ) ఈవుతము ( హైద. ఆర్కె. సీరీస్‌. 3.2.8, 1236 ) మొ. వి. శాసనాల్లో కని పిస్తాయి.

4.56. అసమాపక క్రియలు : క్త్వార్ధకంలో సారస్వత శాసనాల రూపా -లకు వ్యత్యాసం లేదు. చేసి (SII 90.17,1177) మొ. వి. శత్రర్థకంలో కూడా వ్యత్యాసం లేదు. పరగుచును (పై 4.675 45,1140), కాని ఈ రూపానికి సముచ్చయ ప్రత్యయం చేరడం కద్దు. చేయచున్ను (పై. 6.287.5, 1273). చేస్తుండి అనే ఒక్క రూపం ( NI 1.7.15.1275). -తు- ప్రత్యయంతో కనిపిస్తుంది. కేతన గ్రామ్యాలు అన్న కొంటూ మొదలై ని రూపాలు శాననాల్లో కనిపించటంలేదు. వ్యతిరేకార్థకంలోను శాసన సారస్వత భాషల్లో వ్యత్యాసంలేదు. నడపక (SII 10. 671.11,1128) మొ.వి. అన్నంత రూపాల్లోనూ. శాసన సారస్వత భాషలకు వ్యత్యాసం లేదు. కొలువను ( పై. 6.758.6, 1113) మొ. వి.

చేదర్ధకం : ఇనన్‌/-ఇనాన్‌ చేదర్దక ప్రత్యయాలు. పేర్కొనినం (SII 6.151.60,1161 ) మొ. వి. అమ్మినాను. (పై. 110.422.93.1269); కొన్వా దులకు -నన్‌/- నాన్‌, పడ్వాదులకు -ఆన్‌ ప్రత్యయాలు వస్తాయి. పేర్కొన్నను (పై. 10.89.16,1132), ఉన్నాను ( పై. 10.556.49,1358 ), ఆడ్డపడ్డాను. (పై.4.985.89, 1269). 13వ శతాబ్దినుంచి చేదర్ధకంలో -ఇతే/-తే ప్రత్యయాలు కనిపిస్తాయి. పోయితేను ( SII 10.332.80,1250 ), చేస్తే (NI 8.48.56, 1252) మొ. వి.

4.57. విశేషణాలు :

(క) గుణవాచక విశేషణాలు విశేష్యాలకు ముందు వస్తాయి. నల్లరాయి (SII 6. 1142.12,1268), పచ్చిపాలు (పై. 6. 1000 9,1307 ) మొ. వి. నామపదాలు కూడా ఇలా రావచ్చు. కలుగాడి (పై 5.213.8,1286).