136
తెలుగు భాషా చరిత్ర
4.54. వర్తమాన భవిష్యత్ప్రత్యయాలు : చిన్నయసూరి తద్ధర్మార్థక ప్రత్యయాలన్నవి వాస్తవానికి ఆ రోజుల్లోని వ్యవహరాన్ని బట్టి రెండురకాల ప్రత్యయాలని చెప్పవచ్చు. -ఎద-, =ఎడి/ఎడు- వర్తమాన భవిష్యత్ప్రత్యయాలనీ, తక్కిన వాటిని తద్ధర్మ భవిష్యత్రత్యయాలని చెప్పవచ్చు. శాసనాల్లో వర్తమాన భవిష్యత్రత్యయాలు చాలా ఆరుదు. చెరిచెదను ( SII 10,590.54, 1314 ), నడిచెదము. ( పై. 10 504.22, 1313 ). ఈ రెండు ప్రయోగాలుమాత్రం లభించాయి.
తద్ధర్మ భవిష్యత్రత్యయాలు ; ప్రథమైక పురుషంలో ప్రత్యయం Ø (అంటే ప్రత్యయం ఉండదు అని అర్థం), మిగతావాటి ముందు -దు/-తు-/-డు- వస్తాయి: అవును (SII 10.465.115, 1290 ), పోదురు ( పై. 5.1316.12,1113), వరియింతురు. ( పై. 4.945.3, 1152 ), విండుము (పై. 6.123.52 1132). వీటిలో చివరి ఉదావారణ తప్ప మిగిలినవి ఆ కాలపు సారస్వత భాషా ప్రయోగాలకంటె భిన్నమైనవి కావు.
కాలసూచన లేనివి :
4.55. (అ) వ్యతిరేకార్థకాలు : వీటిలో క్రియాప్రాతిపదిక + వ్యతిరేక బోధక ప్రత్యయం + పురుష ప్రత్యయం అని మూడవయవాలుంటాయి. అందు -అ- వ్యతిరేక బోధక ప్రత్యయం. ఈ కిందివి పురుష వచనప్రత్యయాలు.
ఏక బహు
ఉత్తమ - ము మధ్యమ - - ప్రథమ మహత్ అమహత్ మహన్మహతి క్లీబ
- -దు -రు -వు
శాసనాల్లో ప్రయోగాలు లేనిచోట్ల చూపించలేదు. అడ్డపెట్టము ( SII 10.556. 56.1358), అడుగపడయదు ( పై. 5.1181.17,1341 ), పడయదు. (పై. 4,974.5,1132), లే, కా మొ. ప్రాతిపదికలకు వ్యతిరేకబోధక ప్రత్యయం లోపిస్తుంది. లేదు ( పై. 10,261.41, 1214) మొ.వి.
(అ) విధ్యర్థకం: పురుషవాచక ప్రత్యయాలు ఏకవచనంలో - ము,