Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

138

తెలుగు భాషా చరిత్ర

(ఖ) హఅహఅహఅ రూపంలో ఉన్న మువర్ణకాంతాలైన తెలుగుపదాలు విశేషణాలయ్యేటప్పుడు మువర్ణకానికి బదులు -ప వస్తుంది. ఇనుప కవదివియ (SII 5.1265. 11,1207).

(గ) మిగిలిన మువర్ణకాంతాలు విశేవణా లయ్యేటప్పుడు -ము వర్జానికి బదులు -పు వాడటం ఈయుగంలో తరచుగా కనిపిస్తుంది. దక్షిణపు వలను (తె. శా. 1.177.8,1190)మొ. వి. ఇలా -ము, -పు కావడం 12వ శతాబ్దిలో క్వాచిత్కంగాను రానురాను అధికంగాను కనిపిస్తుంది. -౦పు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. వజ్రంపు రాకోట ( SII 4.1379.6,1881).

(ఘ) ఉదంతం లేక అదంతమైన పదాలు విశేషణా లయ్యేటప్పుడు అనుస్వారం తరచుగా కనిపిస్తుంది. తూర్చుంబౌలము ( SII 10.526. 15,1819), చెఱకుం గుడ్ములు (బెల్లపు ఊటలు) (పై. 5.1275. 7,1283), తెల్లంబ్రాలు (పై. 4.1328.9,1115) మొ. మువర్జకం వువర్ణకంగా మారితే ను వస్తుంది. ఉత్తరపుం బొలము (పై. 5.126.6,1296).

(ఞ) పరిమాణార్థత ప్రత్యయం : పరిమాణార్థక పదాలకు -ఎణ్డు లేక -అణ్డు ప్రత్యయాలు చేరుతాయి. పుట్టెణ్డు (SII 5.1114.15,1168), మానండు (పై. 6,1166.6,1198) మొ. వి. -అండు ప్రత్యయం విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలోను, ఎండు తక్కిన చోట్ల తోను విరివిగా కనిపిస్తాయి.

(చ) వైభాజిక, ప్రత్యయం (Distributive) చేసి లేక ఏసి ప్రత్యయాలతో వైభాజీక పదాలు విశేషణంగా వస్తాయి. మానెండు సేసినేయ (SII 4.667.15,1132), మూండేసి (పై. 4.677.52,1180), మొ. వి. 12వ శతాబ్దిలో -చేసి ప్రత్యయమే తరచుగా కనిపిస్తుంది. కాని 14వ శతాబ్దిలో ఇది కనిపించదు. -ఏసి ప్రత్యయం 13వ శతాబ్ది నుండి ఎక్కువౌతుంది.

(ఛ) సంఖ్యావాచక విశేషణాలు : ఒక్క ఒకటి సంఖ్య తప్ప తక్కిన అన్ని సంఖ్యావాచకాల్ని అలాగే విశేషణాలుగా ప్రయోగించవచ్చు.