శాసన భాషా పరిణామం 135
(గ) -ఏ విశేషణ ప్రత్యయానికి ముందు యకారం సకారం అవుతుంది. చేసేవాండు. ( NI 1.38.63, 1217 ). ఈ ప్రత్యయం రాకున్నా కొన్ని చోట్ట ఈ మార్పు వస్తుంది. చేసువాండు (SII 10.61.7. 1104) మొ.వి.
(ఘ) అచ్చు ( < అర్చు ) ధాతువు అన్నంత ప్రత్యయం ముందు అరు- అవుతుంది. అరువంగలవాండు (SII 4.1200.16, 1263) మొ. వి.
4.52. సమాపక క్రియలు : సమాపక క్రియలు రెండు రకాలు. 1. సామాన్య సమాపక క్రియలు (Simple) -వచ్చెను, వచ్చును మొ. వి. 2. సంశ్లిష్ట సమాపక క్రియలు (periphrastic) వచ్చుచున్నాడు, మొ. వి. కింద సామాన్య సమాపక క్రియలు మాత్రం వివరిస్తాను. ఈ సామాన్య సమాపక క్రియలు రెండు రకాలు.. (అ) కాలబోధకాలు, (ఆ) కాలబోధకాలు కానివి. కాలబోధక రూపాలకు క్రియా ప్రాతిపదిక + కాలప్రత్యయం + పురుష వచన ప్రత్యయము అనే మూడు విభాగాలున్నాయి. వీటిలో పురుషవచన ప్రత్యయాలు ఈ కింది విధంగా ఉంటాయి.
పురుష వచన ప్రత్యయాలు :
ఏక బహు
ఉత్తమ.. -ను -ము/-మి
మధ్యమ -- -రి
ప్రథమ -ను (క్లీబ బహుత్వం కూడా) -రు/-రి(మహన్మహతిమాత్రం)
మధ్యమ పురుష ఏకవచన రూపాలు శాసనాల్లో కనిపించవు.
4.53. భూతకాలిక ప్రత్యయాలు : -ఎ ప్రథమపురుష ఏకవచనం, క్లీబం బహువచనంలోను -ఇ ప్రథమ పురుష మహన్మహతీ బహువచనంలోను, -ఇతి/-తి ఉత్తమ మధ్యమ పురుషల్లోను వస్తాయి. జనించెను (SII 4.677.16, 1180), ఇచ్చిరి (పై. 5 1016.17, 1184), ఇచ్చితిమి (పై. 5.70.15, 1177), ఇస్తిమి ( పై. 6.121.37, 1119 ): వీటిలో చివరి ఉదాహరణ తప్ప మిగిలినవన్నీ సారస్వతభాషలోవలెనే ఉన్నాయి.